క్రియేటివ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన “వందే వేద భారతం ” చిత్రకళా పోటీలో బహుమతి పొందిన చిత్రాలతో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంస్కార భారతి సౌజన్యంతో వందే వేద భారతం పేరుతో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు.
మూడు రోజుల పాటు రామాయణం, మహా భారతం, భాగవతం అంశాలపై చిత్రకళా ప్రదర్శన ఉంటుంది. చిత్రకళా ప్రదర్శనను శుక్రవారం(6-10-23) ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మనువిహార్ ప్రారంభించారు. సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు ఆకొండి పవన్ కుమార్, క్రియేటివ్ ఆర్ట్స్ ఫైన్ అకాడమీ అధ్యక్షుడు అంజి విద్యార్థులకు రామాయణ ఇతిహాసాల గురించి తెలిపేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన “వందే వేదభారతం” చిత్రకళా పోటీల బహుమతి ప్రదానం అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకొండి అంజి అధ్యక్షతన ఆదివారం(8-10-23) నిర్వహించారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన జాతీయస్థాయి చిత్రకారులు ఎం. రాంబాబును సత్కరించారు. అనంతరం చిత్రకళల్లో ప్రతిభచాటిన విజేతలకు బహుమతులందించారు. కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చైర్మన్ మనువిహార్, సమగ్ర శిక్ష అభియాన్ సీ.ఎం.వో. బి.వి.వి. సుబ్రహ్మణ్యం, సంస్కార భారతి అధ్యక్షుడు ఆకొండి పవన్, చిత్రకారులు మధు, పి. శ్రీనివాస్, ఉండ్రు ఆశీర్వాదం, కార్టూనిస్ట్ ఎం. రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో దూర ప్రయాణం చేసి ఈ బహుమతులను అందుకోవడం ఎంతో ఉన్నతమైనవిగా భావిస్తూ… విజయవాడ, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, శ్రీకాకుళం, మంగళగిరి వంటి సుదూర ప్రాంతాల నుండి దాదాపు ప్రయాణం చేసి, తమ పిల్లల ఆనందాల కోసం, శ్రమపడి వచ్చారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.
నాలుగు గూపులు గా జరిగిన ఈ పోటీల్లో విజేతల వివరాలు:
________________________________________________________________
గ్రూప్-ఏ. (Group-A)లో మొదటి బహుమతి: ఏ. శ్రీహాస్-విజయవాడ, రెండవ బహుమతి: హరి చందన – విజయవాడ, మూడవ బహుమతి: లక్ష్మి ప్రసన్న- రాజమండ్రి.
గ్రూప్-బి. (Group-B) లో మొదటి బహుమతి: శాయి వైష్ణవి-సికిందరాబాద్, రెండవ బహుమతి: కృష్ణ భగీరధ్ – విజయవాడ, మూడవ బహుమతి: ఐశ్వర్య-మండపేట.
గ్రూప్-సి. (Group-C) లో మొదటి బహుమతి: తుమ్మపాల గీత – మండపేట, రెండవ బహుమతి: టి. రాకేష్ -పాలకొల్లు, మూడవ బహుమతి: కె. మనికంఠ స్వామి -పెదకండ్ల పాలెం.
గ్రూప్-సి. (Group-D)
లో మొదటి బహుమతి: కొసనా భాస్కర రావు – పాలకొల్లు, రెండవ బహుమతి: మెట్టు రాజు-కచ్చాపూర్, మూడవ బహుమతి: డి. భాస్కరరావు -హైదరాబాద్.
-కళాసాగర్
వందే వేద భారతం చిత్రకళా ప్రదర్శన గురించి మంచి సమాచారం రాసిన మిత్రులు కళా సాగర్ గారికి ధన్యవాదములతో…
అంజి ఆకొండి