దుబాయ్ వేదికగా మెరిచిన తెలుగు చిత్రకారుడు

తండ్రి తాలూకు గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం తెలియాలనే ఉదేశ్యముతో… దుబాయ్ వేదికగా ఉన్న ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ వ్యవస్థాపకులు అనిల్ కేజ్రివాల్ గారు మరియు వారి టీం ఫాదర్స్ డే కోసం ఆన్లైన్ విధానంలో నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు కనుమూరి శ్రీనివాసరావు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు.

వివరాలలోకి వెళ్ళితే … దుబాయ్ వేదికగా ఉన్న ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ వ్యవస్థాపకులు అనిల్ కేజ్రివాల్ గారు మరియు వారి టీం ఫాదర్స్ డే కోసం #We Have A Hero We Call Him Dad# అనే ఒక అంశముతో ఆన్లైన్ విధానంలో అంతర్జాతీయ చిత్రకళా పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలను 16 సంవత్సరాల లోపు ఉన్న వారంతా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీ…16 సంవత్సరాల పైబడిన అందరిని చిత్రకారులు కేటగిరీ క్రిందన పరిగణించారు.

ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారా ఓటింగ్ ని నిర్వహిస్తారు. ఈ విధానంలో నిర్వహించిన పోటీలకు ఎవ్వరికీ అయితే ఓట్లు అధికంగా పడతాయో వారికి జ్యూరీ సభ్యుల ఓటులను కూడా జోడించి విజేతగా ప్రకటిస్తారు. ఈ విధంగా నిర్వహించిన ఈ పోటీలలో విశాఖపట్నం కి చెందిన చిత్రకారుడికి, చిత్రకారుల విభాగంలో రెండోవ బహుమతి ని ఇవ్వటం జరిగింది. ఈ అవార్డ్ క్రిందన నగదు, మెమోంటో, మెడల్ను అందించనున్నారు.

ఈ చిత్రంలో ఒక తండ్రి ఒక బిడ్డ పుట్టినప్పటి నుండి ఎంత ప్రేమగా చూసుకుంటాడో వివిధ దశలలో చూపించటం జరిగింది. దానికి మన సాంప్రదాయ చిత్రకళ అయిన కళంకారి చిత్రకళకు సంబంధించిన Motifs ని మేళవించి ఈ కళాఖండాని రూపొందించటం జరిగింది. అందుచేత జ్యూరీ సభ్యుల మనసు దోచుకోవడం వల్ల ప్రపంచ స్థాయిలో రెండోవ బహుమతిని గెలుచుకోవటం జరిగింది.
“తల్లి బిడ్డను 9 నెలల పాటు కడుపులో మోస్తుంది”, కానీ ఒక తండ్రి తన చివరి శ్వాస వరకు బిడ్డను ఎల్లప్పుడూ భుజంపై మోస్తూ ఉంటాడు.
“తండ్రి అనే ఒక వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబానికి వెన్నెముక మరియు ముఖ్యంగా మన భారతదేశంలో అతను మాత్రమే సంపాదించే సభ్యుడు మరియు అతను మొత్తం కుటుంబాన్ని చూసుకుంటాడు. చాలా మంది తండ్రులు తన కుటుంబం సంతోషంగా జీవించడానికి డబ్బు సంపాదన కోసం తన ఇంటి బయట జీవితాంతం గడుపుతారు. అలాంటి నాన్నలందరికి తన చిత్రం అంకితం అని, నా విజయానికి నా భార్య జయలక్ష్మి సహకారం లేనిదే నేను ఈ విజయాలు సాదించలేనని” శ్రీనివాసరావు తెలియజేశారు.

ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ , దుబాయ్ వారు గత సంవత్సరం(2022) ఆన్లైన్ పద్ధతి లో సంకటమోచన్- హనుమాన్ విజ్ఞహర్త- వినాయక అనే అంశాలలో ప్రపంచ స్థాయిలో మొదటి బహుమతిని, 75 సం. ల స్వాతంత్ర్య భారతదేశం అంశముతో మూడోవ బహుమతిని గెలుచుకోవటం జరిగింది.
శ్రీనివాసరావు విశాఖ నగరంలో అటు చిత్రకారుడిగా కొనసాగుటూ- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ లో ఉన్న RBM UP ప్రభుత్వ పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయుడిగా పని చేస్తూన్నాడు.

“విద్యార్థిని విద్యార్థులకు కూడా మెలుకువ లు నేర్పిస్తూ వారు కూడా అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ గెలుసుకునే విధంగా తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. ఈ పోటీలలో తన విద్యార్థినులను కూడా చైల్డ్ ఆర్టిస్ కేటగిరీ లో ఈ పోటీలలో పాల్గొనేటట్టు చేశారు.

జూన్ 8వ తేదీన మరియు జ్యూరీల స్కోర్లు మరియు ఆన్లైన్ ఓట్ల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. గత 50 రోజులలో Arts and Crafts సంస్థ వారికి 10 కంటే ఎక్కువ దేశాల నుండి 200 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయి. మరియు 4 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వారందరూ కూడా ఈ పోటీలలో పాల్గొనటం జరిగింది.
శ్రీనివాసరావు గెలుపొందిన అవార్డును త్వరలో ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా అందుకున్న తరువాత ఆ అవార్డును గౌరవనీయులు ఆంధ్రాయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గారి చేతులమీదుగా అందుకొనున్నారు.

-కళాసాగర్ యల్లపు

1 thought on “దుబాయ్ వేదికగా మెరిచిన తెలుగు చిత్రకారుడు

  1. మీ ఆదరణ మరువలేనిది Sir…
    ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap