తిరుపతిలో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్

తిరుపతిలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్
—————————————————————————————

అరవై నాలుగు కళలలో చిత్రకళ కూడా ఒకటి. ప్రతీ ఒక్కరూ… ఏదో ఒక సమయంలో తమకు నచ్చిన చిత్రాలను వేస్తూ.. రంగులు అద్దుతూ మురిసిపోతారు. అలాంటివారంతా ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శిస్తే చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. అలాంటి వారంతా మనముందే కుంచెపట్టి లైవ్ పెయింటింగ్స్ వేస్తుంటే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. అలాంటి కార్యక్రమాన్ని తిరుపతి ఆర్ట్ సొసైటీ-తిరుపతిలో నిర్వహించారు. తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్యకళాశాల వేదికగా ‘జాతీయ చిత్ర ప్రదర్శన-2024’ మరియు ఆర్ట్ క్యాంప్ ను (ఫిబ్రవరి 10, 11 తేదీలలో) శని, ఆదివారాల్లో నిర్వహించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెందిన సుమారు 45 మంది చిత్రకారులు పాల్గొన్నారు. ఇందులో పది మందికి పైగా మహిళా చిత్రకారిణులు పాల్గొనడం విశేషం.

తిరుపతి ఆర్ట్ సొసైటీ (టిపిఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఆర్ట్ క్యాంప్ ప్రదర్శన ఆదివారం సాయంత్రం ముగిసింది. శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆవరణలో నిర్వహించిన ముగింపు సభలో ఎస్వీయూ మాజీ వీ.సీ. ఆచార్య పి.మురళి ముఖ్యఅతిధిగా హాజడయ్యారు. చిత్రలేఖనం వంటి సృజనాత్మక కళలను ప్రోత్సహించడం ముదావహమన్నారు. అనంతరం సీనియర్ చిత్రకారులు రావూరి సుబాష్ బాబు, చింతా నారప్పు, సి.వి. అంబాజీ లను సత్కరించారు. లైవ్ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను అభినందించి, జ్ఞాపికలతో సత్కరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ చిత్రకళా ప్రదర్శనలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెందిన 45 మంది చిత్రకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్ట్ సొసైటీ (టీఏ ఎస్) అధ్యక్షుడు డాక్టర్ హేమాక్షి ఆచారి, కార్యదర్శి ఈ. బాలసుబ్రమణ్యం, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ ఉమ ముద్దుబాల, ప్రముఖ సీనియర్ చిత్రకారులు సింగంపల్లి సత్యనారాయణ, కలుపగుంట రామమూర్తి, జి.ఎస్.ప్రసాద్, రామచంద్రయ్య, ఆనంద్, హేమంత్ బాబు, గాయత్రీదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

-కళాసాగర్ యల్లపు (9885289995)

Tirupati Art Society art camp

National Level Art Exhibition and Camp at Tirupati

The National Art Camp and exhibition organized by Tirupati Art Society-Tirupati concluded on Sunday (February 11th) evening. In the closing meeting held in the premises of Srivenkateswara Sangeeta Nritya College, former VC of SVU. Acharya P. Murali was the chief guest. It is important to encourage creative arts like painting. Later senior artists Ravuri Subash Babu, Chinta Narappa, C.V. Ambaji was honored. The artists who participated in the live art exhibition were felicitated and honored with guests. 45 painters from the states of Tamil Nadu, West Bengal, Karnataka, Telangana and Andhra Pradesh participated in this two-day art camp and exhibition.
In this program, President of Tirupati Art Society (TAS) Dr. Hemakshi Achari, Secretary E. Balasubramaniam, Principal of SV College of Music and Dance Uma Mudubala, famous senior painters Singampalli Satyanarayana, Kalagunta Ramamurthy, G.S. Prasad, Ramachandraiah, Anand, Hemant Babu, Gayatri Devi, Rama Devi and others participated.

Participated artist’s list:
—————————
Mrs. Archana B., Tirupati
Mrs. Aruna Kumari Sandadi, Nellore
Mr. Balasubramanyam, Tirupati
Mrs. Bharathi Kar, Odisha
Mrs. Bhavani Suresh, Tirupati
Miss. Bhavishya Ravi, Ongole
Mr. Chandranath Das, Kolkota
Mr. Chandrasekhar Batti, Giddaluru
Mr. Damodara Achary, Chittoor
Dr. Balaji Sing M., Chennai
Mr. Gampa Mallaiah Biri, Anantapur
Mrs. Gayatri Devi G., Tirupati
Dr. Hemakshi Achari N., Tirupati
Mr. Hemanth Babu A.S., Tirupati
Mr. Jeevan Kumar Turaka, Gudiwada
Mrs. Latha Karanam, Tirupati
Mr. Lam Varthana Rao, Guntur
Miss. Lavanya, Tirupati
Mr. Manohar Singh, Sullurupeta
Mrs. Mohana Priya, Tirupati
Mr. Muragaiah Mallarapu, Tirupati
Mr. Narayana Murthy M., Srikakulam
Mr. Padmaja C.M., Tirupati
Mr. Pichaiah Pallam, (Telangana)
Mr. Rajmohan A., Chennai
Mrs. Ramadevi Aluru, Hyderabad
Mr. Ravikumar Ch., Ongole
Mr. Reddappa J., Tirupati
Mr. Sagara Babu Nandigam, Narasaraopet
Mr. Sambasivam V., Chennai
Mr. Shaik Abdul Sattar, Markapuram
Mrs. Sridevi Ragimanu, Bangalore
Mr. Sreeramulu U., Karnool
Mr. SrinivasaRrao M., Tirupati
Mr. Tulasi Prasad, Puttur
Mrs. Uma Tirumalasetti, Hyderabad
Mrs. Usha Nagasri Annamraju, Hyderabad
Mr. Vajragiri Justice, Vinukonda
Mr. Vallem Krishna, Gokanakonda
Mr. Vara Prasasd Pyda, Nellore
Mrs. Vijayalakshmi S., Tirupati
1 thought on “తిరుపతిలో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్

  1. చాలా బావుందండీ.. ఆర్టికల్. ఇటువంటివి చూస్తున్నపుడు నాకు కూడా పెయింటింగ్ నేర్చుకోవాలిపిస్తుంది.
    ఆర్టిస్టులందరికీ నా అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap