అద్భుతమైన ఆర్ట్.. వైరల్ అవుతోన్న స్కెచ్
ఆరుగురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో అది కూడా కాఫీ తాగుతూ చిల్ అవుతున్న ఫొటో ఎంతగా వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్స్ నిజజీవితంలో అయితే కలువలేదు కాని ఒక ఆర్టిస్టు తన పెన్సిల్ తో కలిపి అద్భుతంను ఆవిష్కరించాడు. అతడి అద్భుతం ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో ట్రెడ్డింగ్ అవుతుంది. ఆర్టిస్టు హర్ష వేసిన ఈ పెన్సిల్ ఆర్ట్ అందరు హీరోల అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. హీరోలు అంతా కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా ఈ ఆర్ట్ లో హర్ష చూపించే ప్రయత్నం చేశాడు. అతడి ఆర్ట్ ఎలా ఉన్నా అతడి కాన్సెప్ట్ కు జనాలు ఫిదా అవుతున్నారు. అందరు హీరోలను ఒక్క చోటుకు చేర్చాలన్న మీ ఆలోచన నిజంగా అద్భుతం అభినందనీయం అంటూ నెటిజన్స్ హర్షపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ను సాక్షాత్ పవన్ కల్యాణే తన ట్విటర్ ద్వారా షేర్ చేయడం విశేషం. ప్రముఖులు కూడా ఈ ఫొటోను షేర్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ మందికి ఈ ఫొటో అనేది రీచ్ అవుతుంది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. మహేష్ బాబు.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ మరియు ప్రభాస్ లను చూడవచ్చు. టాలీవుడ్ ను ఏలేస్తున్న ఈ ఆరుగురి అభిమానులు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అందరు హీరోల అభిమానులు షేర్ చేస్తున్న ఫొటోగా ఈ ఆర్ట్ నిలిచింది.
అంధ్రప్రదేశ్ లోని నెల్లూరు కు చెందిన హర్ష ప్రతిభావంతుడయిన చిత్రకారుడు. ఇతను తనరెండు చేతులతోనే కాదు, నోటితో కూడా చిత్రాలు గీయగలడు. గతంలోనూ పలువురి స్టార్స్ చిత్రాలు గీసి వారికి బహుకరించారు. వారిలో పవన్ కల్యాన్, అమితాబ్ లాంటి వారున్నారు. చిత్రకళలో నిత్యం ప్రయోగాలు చేసే హర్ష దగ్గర ఎందరో చిత్రకళ లో శిక్షణ పొందుతున్నారు.
మరికొంత తెలుసుకోవాలంటే హర్ష యూట్యూబ్ చానల్ చూడండి…
https://www.youtube.com/watch?v=u79jPXvt_XE
సూపర్బ్