బ్రహ్మానందం పోట్రైట్స్ పోటీలో విజేతలు

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ, హనుమకొండ వారు ప్రతిష్టాత్మాకంగా నిర్వహించిన “పద్మశ్రీ బ్రహ్మానందం పోర్ట్రైట్ ఛాలెంజ్” లో 300 మంది కి పైగా చిత్రకారుల పాల్గొన్నారు. వీటి నుండి ఉత్తమమైన 9 మంది చిత్రాలు ఎన్నుక చేసి విజేతలలుగా ప్రకటించి, ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ లో బ్రహ్మానందం గారి చేతుల మీదుగా విజేతలకు అవార్డ్స్ బహుకరించారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు గాను.. హాస్యబ్రహ్మ మన ఆడబిడ్డ సాగంటి మంజుల అభినందించారు.

తమ విలువైన సమయాన్ని వెచ్చించి అద్భుతచిత్రాలతో ఈ పోటీలో పాల్గొన్న కళాకారులు అందరికీ, విజేతలకు తమ కృతజ్ఞతలు తెలిపారు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ, డైరెక్టర్ సాగంటి మంజుల.
డ్రాయింగ్, పెయింటింగ్, డిజిటల్ మీడియా అనే మూడు విభాగాలుగా పోటీలు జరిగాయి. ఒక్కో విభాగం నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 9 మంది విజేతలు బహుమతి పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap