నేపథ్యం: హిందూపదపాద్ షాహీ, ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ 350 వ పట్టాభిషేకం సంవత్సర సందర్భంగా ‘జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్‘ నాటకం
……………………………………………………………………………………………
డా. రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ వారిచే
జయహో ‘శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’ చారిత్రాత్మక నాటకం
రచన, దర్శకత్వం డాక్టర్ పి.వి.యన్. కృష్ణ (అధ్యక్షులు, సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్)
తేదీ: 18 నవంబర్ 2023, శనివారం, సమయము: సాయంత్రం 6-00 గంటలకు
వేదిక : తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం, విజయవాడ.
……………………………………………………………………………………………..
శివాజీ జీవితంలోని ప్రేరణదాయకమైన మట్టాలను, దేశభక్తి ప్రపూరితమైనటువంటి శివాజీ అనుచరులను, వారి జీవితాలను, ఆయన యుద్ధనీతిని, యుద్ధ రీతిని, శివాజీ విజయాలను, అనేక కోటల నిర్మాణం వెనుక ఉన్న యుక్తిప్రయుక్తులను, పరిపాలనా చాతుర్యమును, దౌత్య విధానాలను, విదేశీ, స్వదేశీ వాణిజ్య చతురతను నేటి తరానికి అందించడం ధ్యేయంగా నాటక రూపంలో ప్రదర్శించడం జరుగుతున్నది. 60 మంది నటీనటులతో, ఎల్.యిడి. మొదలైన ఆధునిక సాంకేతికతతో, వీనులవిందైన దేశభక్తి ప్రపూరితమై నటువంటి పాటలతో, భారీ సెట్టింగులతో, నయనానంద కరమైన నృత్యాలతో ఈ నాటక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ సంస్కార భారతి మీ ముందుకు తీసుకు వస్తున్నది.
సంస్కార భారతి:
లలిత కళల ద్వారా సమాజ సంఘటనకు కృషి చేస్తున్న అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి 1981 వ సంవత్సరంలో ఆగ్రా నగరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ విష్ణు శ్రీధర్ వాకన్ కర్ చే ప్రారంభింపబడి నటు వంటి సంస్థ సంస్కార భారతి. అప్పటినుండి కూడా దేశమంతటా కూడా అనేక శాఖలుగా విస్తరిస్తూ దేశంలో ఉండేటువంటి అనేక మంది కళాకారులను సమన్వయ పరుస్తూ సంఘటిత పరుస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది సంస్కారభారతి సంగీతము, నాట్యము, చిత్రలేఖలను, నాటకము, శిల్పము, సాహిత్యము వంటి అనేక రంగాలలో నిష్ణాతులైన వారిని గౌరవిస్తూ వారిని సన్మానిస్తూ ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది సంస్కార భారతి.