పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీ ఫలితాలు

ఇటీవల రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోపూరి శ్రీనివాస్‌’ స్మారక పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీలకు మొత్తం 165 కథలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో – ‘సిగ్నల్స్‌’ కథా రచయిత దేశరాజుకు ప్రథమ బహుమతి, ‘కార్డు కథ’ రచయిత శింగరాజు శ్రీనివాసరావుకు ద్వితీయ, ‘దేవుడి స్వగతం’ రచయిత కొయిలాడ రామ్మోహన్‌రావుకు తృతీయ బహుమతులు లభించాయి.

కె.వి.సుమలత రచన ‘మన దారిలోనే’, దారం గంగాధర్‌ ‘రూపాయి విలువ’, జి.రంగబాబు ‘సదస్సు’, పాతూరి అన్నపూర్ణ ‘ఆవేదన’, నంద త్రినాధరావు ‘పోష్టర్‌’ కథలకు ప్రోత్సాహక బహుమతులు లభించాయి. విజేతలకు జిపే (GooglePay) ద్వారా బహుమతులు పంపబడతాయని పోటీల నిర్వాహకులు కోపూరి పుష్పాదేవి, చలపాక ప్రకాష్‌ తెలియజేశారు.

2 thoughts on “పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap