ఆర్ట్ అసోసియేషన్ ‘గిల్డ్’ ప్రచురణలు రాష్ట్ర గవర్నర్ కి అందజేత
డిసెంబర్1 వ తేదీ ఉదయం 11:30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో విజయవాడ రాజ్ భవన్ లో ‘గిల్డ్’ చిత్రకారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిల్డ్ అధ్యక్షులు డా.బి. ఎ.రెడ్డి, కార్యదర్శి శ్రీమతి ఎన్.వి.పి.ఎస్.ఎస్.లక్ష్మి, గిల్డ్ కన్వీనర్ మరియు డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకలు పి.రమేష్, కె.ఎల్. టెక్నాలజీ ఇంక్యూబేటర్ ఫౌండేషన్ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ అలోక్ గోవిల్, యువ చిత్రకారుడు శేఖర్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ‘గిల్డ్’ మరియు యంగ్ ఇన్వాయిస్ ఇంటర్నేషనల్ సంస్థల ద్వారా చేపట్టిన వివిధ చిత్ర కళా కార్యక్రమాలను గవర్నర్ కు వివరించి సంస్థ ప్రచురించిన పలు పుస్తకాలను రెడ్డి గారు బహూకరించగా, పుస్తక ప్రియులైన గవర్నర్ వాటిని ఆసక్తిగా అందుకుని పరిశీలించారు.
రాజమండ్రిలోని నన్నయ్య విశ్వ విద్యాలయంలో ఒక చిత్ర కళావిభాగాన్ని ఏర్పాటు చేయమని కోరిన ఎన్.వి.పి.ఎస్.ఎస్.లక్ష్మి కోరికను పరిశీలిస్తామని తెలియజేశారు. సుమారు 25 ని.ల పాటు జరిగిన ఈ సమావేశంలో చిత్రకళా అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.
Very nice
Thank you Rambabu garu.