(సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే కళాకారుల అధ్బుత కళాఖండాలు సృష్టించివచ్చు -జి. వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్, ఇన్ చార్జి డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా.)
రెండు రోజులపాటు విజయవాడలో డిజిటల్ ఆర్ట్ ఎగ్జిబిషన్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా విజయవాడలో బాలోత్సవ్ భవన్ లో ఏర్పాటు చేసిన అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారి డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ని ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్, ఇన్ చార్జి డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ జి.వెంకటేశ్వర్లు ఈ రోజు (7-10-23) లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారిలా ఉపయోగించుకోగలిగితే సమయంతో పాటు ధనాన్ని కూడా ఆదా చేసుకోవచ్చని.. తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ చేయొచ్చని.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారగలిగినప్పడు మాత్రమే విజయాన్ని అందుకోగలమని అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన పూర్ణా హార్ట్ ఇన్స్టిట్యూట్ కన్సల్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్: ఏ.పూర్ణానంద్ మాట్లాడుతూ కళాకారులకు మారిన సాంకేతిక అద్భుత వరమని చిన్నా పెద్దా అందరూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన గుంటూరు రామరాజు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్. రామరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు ప్రతి ఒక్క పిల్లవాని చేతిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉంటున్నాయని వాటిని ఎలా ఉపయోగించాలో వారికి తెలియజేస్తే వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తితో అద్బుతాలు సృష్టించగలరన్నారు. మరొక విశిష్ట అతిథి ఇన్నర్ వీల్ క్లబ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీమతి హరితా చౌదరి మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం గత మూడు నెలలుగా చిత్రకళారంగానికి చేస్తున్న కృషి అభినందనీయమనీ.. మెట్రో నగరాల సరసన మన విజయవాడ నగరాన్ని నిల్చోబెట్టాలన్న వారి ప్రయత్నం ఫలించాలని అన్నారు.
అనంతరం అతిథుల చేతుల మీదుగా నవంబర్ నెలలో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్, ఆర్ట్ మేట్ స్కూల్ ఆఫ్ ఆర్టిస్ట్స్, చిత్రం ఆర్ట్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ఆర్ట్ ప్యారడైజ్” పోస్టర్ విడుదల చేసారు. జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు గారు మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం వెలిగించిన చిత్రకళా దీపాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతా చిత్రకళా పండుగలకు అంకురార్పణ అయ్యిందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో మొదటి రోజే కొన్ని చిత్రాలు అమ్ముడు పోవడం నిర్వాహకులకు ఉత్సాహాన్నిచ్చింది.
ఈ కార్యక్రమానికి ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ అధ్యక్షత వహించగా, కార్యక్రమ నిర్వాహకుడు స్ఫూర్తి శ్రీనివాస్ పర్యవేక్షించగా..కో కన్వీనర్ గిరిధర్ అరసవల్లి, కో ఆర్డినేటర్ ఎస్.పి.మల్లిక్, వర్కింగ్ కమిటీ మెంబెర్స్ సుబ్బూ ఆర్వీ, రమేష్ అర్కాల, శ్రావణ్ కుమార్, మహిళా విభాగపు ఇన్ చార్జి శ్రీమతి ఆమ్రపాలి, సంధ్యారాణి, స్వాతి పూర్ణిమ, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Very good event.
Congratulations to the team…