(చిత్రకారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అద్భుతాలు సృష్టించాలి- ఎస్.ఢిల్లీరావ్, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా)
ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 7 & 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే మొట్టమొదటి సారిగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ చిత్రకారులు అనుపోజు జయశ్రీ ప్రభాకర్ గారిచే శ్రీప్రభాతాలు డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ & సేల్ పోస్టర్ ను జిల్లా మెజిస్ట్రేట్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చిత్రకారులు తమ చిత్రకళా నైపుణ్యానికి మెరుగులు దిద్ది అద్భుతాలు సృష్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 5వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఆన్ లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్ నిర్వహించటం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కో-కన్వీనర్ గిరిధర్ అరసవల్లి, ఈవెంట్ మేనేజర్ స్ఫూర్తి శ్రీనివాస్, వర్కింగ్ కమిటీ మెంబర్ సంధ్యా పాల్గొన్నారు.