తిరుపతి ఆర్ట్ సొసైటీ ప్రతి సంవత్సరం వివిధ రకాల చిత్రకళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2023 సంత్సరానికి నేషనల్ ఆన్ లైన్ పెయింటింగ్ కాంపిటీషన్ గత సెప్టెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 53 మంది చిత్రకారులు 95 వర్ణ చిత్రాలను ఆన్ లైన్ పెయింటింగ్ పోటీలకు ఎంట్రీలు పంపడం జరిగింది. ఈ పోటీకి వచ్చిన వర్ణచిత్రాలను యోగివేమన యూనివర్సిటీ, కడప, పెయింటింగ్ శాఖాధ్యక్షులు డా. కె. మృత్యంజయరావు గారు చిత్రకారుల ప్రతిభను ఆధారంగా 30 చిత్రాలను ఎంపిక చేసారు. మొదటి నగదు బహుమతి రూ. 5000/- గంపా మల్లయ్య (అనంతపురం)గారి చిత్రం ‘విలేజ్ ఫెస్టివల్’ కు రాజారవివర్మ అవార్డు రెండవ బహుమతి రూ. 3000/- శ్రీమతి మోనిషా సుబ్రహ్మణ్యం (చెన్నై)గారి ‘పట్టా చిత్రం’ కు వడ్డాది పాపయ్య అవార్డు; మూడవ బహుమతి RS 2000/- కొత్త రవీంద్ర (తెలంగాణ) గారి ‘మేకల కాపరి’ చిత్రానికి దామెర్ల రామారావు అవార్డు; మరియు ఒక్కొక్కరికి రూ. 500/- చొప్పున 13 మంది చిత్రకారులకు TAS Excellency Golden wards; మరో 15 మందికి జ్యూరీ సిల్వర్ అవార్డ్స్ ఇవ్వనున్నారు.
30-09-2023 సాయంత్రం యూత్ హాస్టల్ నందు తిరుపతి ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు డా. నాగవేటి హేమాక్షి ఆచారి, కార్యదర్శి ఈసలాపురం బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు హేమంత్ బాబు, సహా కార్యదర్శి జి. గాయత్రీ దేవి, కోశాధికారి పి. విశ్వరూపాచారి ఫలితాలను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, చిత్రకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.