ఝనక్ ఝనక్ పాయల్ భాజే

కళల కాణాచి తెనాలి సంస్థ గత మూడు సంవత్సరాలుగా కళాకారులకు, నాటకరంగానికి తమవంతు సేవ చేస్తూనే ఉంది.. పలు సాంస్కృతిక విభాగ కార్యక్రమాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎందరినో ప్రోత్సహిస్తూ ఉంది …

కళల కాణాచి సంస్థ ఈ సంవత్సరం ఒక నూతన అధ్యాయానికి తెర తీస్తోంది. యువతను నాటకం వైపు ఎక్కువగా తేవాలని దృఢ సంకల్పంతో సుమారు 100 మంది కళాకారులు వీరిలో 90 శాతం యువకులు ప్రదర్శిస్తున్న నాటకం డాక్టర్ M.S. చౌదరిగారి రచనా దర్శకత్వంలో మన కళల కాణాచి- తెనాలి అధ్యక్షులు డా. సాయిమాధవ్ బుర్రా గారి నిర్వహణ, సారథ్యంలో ఈనెల 17వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మన తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రదర్శించబోతున్న సాంఘిక నాటకం

ఝనక్ ఝనక్ పాయల్ భాజే

ఇంతవరకూ తెలుగు నాటక రంగంలో, సాంఘిక నాటక విభాగంలో ఇంత మంది కళాకారులతో నాటక ప్రదర్శన జరగలేదని,ఇప్పుడు జరగబోతోందని చెప్పటానికి గర్విస్తున్నాం…ఈ నాటక ప్రదర్శనకి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, వేదిక సహకారాన్ని అందిస్తున్న డా. సాయి మాధవ్ బుర్రా మన తెనాలికి మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ… మేము తలపెట్టిన ఈ నూతన అధ్యాయాన్ని విచ్చేసి విజయవంతం చేయాలని, తెనాలి మరియు సమీప ప్రాంతాల్లో ఉన్న కళాభిమానులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కళాపోషకులు, రచయితలు, దర్శకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి నాటక ప్రదర్శనను తిలకించి మీ ఆశీస్సులు అందించాలని మా ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయమని మనవి చేసుకుంటున్నాము.
ఇట్లు
కళల కాణాచి కార్యవర్గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap