“ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” ఆధ్వర్యంలో జులై 16న “జీవన రేఖలు” ఏకవర్ణ చిత్రాల ప్రదర్శన
కళ శాశ్వతం…కళాకారుడు అజరామరం అనే నానుడిని నిజం చేయాలని వర్థమాన చిత్రకారులందరినీ ఒక తాటిపైకి తెచ్చి, వారి చిత్రాలతో కళాభిమానులను రంజింపజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో 2022 డిసెంబర్ 11 నుంచి 31 వరకు ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మంగారి ఆధ్వర్యంలో కళాయజ్ఞ అనే కాన్సెప్ట్ తో చిత్రకళాపోటీలు జరిగాయి.. ఏకవర్ణంతో చిత్రించిన చిత్రాలను 21 రోజుల పాటు రోజుకో అంశంపైన దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది చిత్రకారులు పాల్గొనగా వాటినుంచి 175 మందిని ఎంపిక చేసి హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు.
ఇప్పుడు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మన విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన కళాయజ్ఞ పోటీల్లో పాల్గొన్న 20 మంది చిత్రకారుల నుండి ఒక్కొక్కరివి 3 చిత్రాల చొప్పున జీవన రేఖలు అనే టైటిల్ తో జులై 16న రాఘవయ్య పార్క్ ఎదురుగా ఉన్న బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో చిత్రకళా ప్రదర్శన జరుగనుంది.
ఈ “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శనను ఈ నెల 16 ఆదివారం ఉదయం 9:30 ని: కు MEME ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు గారు లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మం, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రానికి చెందిన పిన్నమనేని మురళీ కృష్ణ, పోలవరపు సాంస్కృతిక సమితి నాయకులు గోళ్ళ నారాయణరావు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నేటి తరం చిన్నారులు మరియు యువ చిత్రకారులకు నీటివర్ణ చిత్రాలు గీయటంపై అవగాహన కల్పించేందుకు ఏలూరుకి చెందిన ప్రముఖ చిత్రకారుడు మధుసూదనరావుతో ప్రత్యేకంగా లైవ్ డిమాన్ట్రేషన్ ఏర్పాటు చేయునున్నామని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సభ్యులు అనుమకొండ సునీల్ కుమార్ తెలిపారు…ఈ అవకాశాన్ని విజయవాడ నగరం మరియు పరిసర ప్రాంతాల్లోని కళాకారులు.. కళాభిమానులు..యువ చిత్రకారులు ఉపయోగించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రముఖ చిత్రకారులు అరసవల్లి గిరిధర్, 64కళలు.కామ్ ఎడిటర్ కళాసాగర్, స్ఫూర్తి శ్రీనివాస్ లు కోరారు.
All the best for participants and organisers… thank you 64kalalu.com for your great support.