ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే గ్రీటింగ్ కార్డ్స్ సందడి బాగా వుండేది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం గ్రీటింగ్ కార్డ్స్ అమ్మకం జరిజేది. కాని ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రవేశంతో గ్రీటింగ్ కార్డ్స్ కనుమరుగయ్యాయి. ఈ తరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డ్స్ కి ఉన్న ప్రాముఖ్యతను తెలియపరిచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో విజయవాడలోని ‘స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్’ ఆధ్వర్యంలో ఆదివారం గ్రీటింగ్ కార్డ్ కాంటెస్ట్ ఉత్సాహంగా జరిగింది 60 మంది కి పైగా చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు.
అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో స్ఫూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరం చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతతో ఇచ్చిపుచ్చుకునే గ్రీటింగ్ కార్డ్స్ ప్రాముఖ్యత తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కాంటెస్టులో గెలుపొందిన విజేతలకు ప్రసంశా పత్రాలు జ్ఞాపికలు అందజేసారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ స్నేహ శ్రీనివాస్ పర్యవేక్షించగా యువ చిత్రకారిణి నంబూరు రమ్య న్యాయ నిర్ణేతగా వ్యవహరించినట్లు స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్ స్పూర్తి శ్రీనివాస్ తెలియజేశారు.
విజేతలు:
ప్రధమ బహుమతి: కె.లళిత, ఇంటర్మీడియట్
ద్వితీయ బహుమతి: ఆశ్రితవల్లి, నాల్గవ తరగతి
తృతీయ బహుమతి: కియాన్స్, అయిదో తరగతి
కన్సోలేషన్ 1: లోహితా రాణి, అయిదో తరగతి
కన్సోలేషన్ 2: ప్రీషా, ఒకటో తరగతి