గుంటూరు లో డిశంబర్ 23 నుండి 28 వరకు నాటక ప్రదర్శనలు
_________________________________________________________
ఎంటీఆర్ రంగస్థల పురస్కారం డా. మీగడ రామలింగస్వామి
_________________________________________________________
వైయస్సార్ రంగస్థలం పురస్కారం : యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (కాకినాడ)
గుంటూరు, వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిశంబర్ 23 నుండి 29 వరకు 22 వ ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. వేదికకు బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రంగణంగా నామకరణం చేశారు. నాటక రంగం తర్వాతే సినీ పరిశ్రమని రాష్ట్రమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఏ.పీ. చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న ‘నంది’ నాటకోత్సవాలు-22′ శుక్రవారంతో (29-12-23) ముగిశాయి. నాటక రచయితగా, నటునిగా, నాటక రంగానికి సేవలందించిన డాక్టర్ మీగడ రామలింగస్వామికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, కాకినాడకు చెందిన యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ డాక్టర్ వైఎస్సార్ రంగస్థల పురస్కారం అందజేశారు. నాటక కళ అభివృద్ధికి కృషి చేసిన బాపట్ల వాసి కే.ఎస్.టి. సాయిని సత్కరించారు. ఎఫ్.డి.సి. చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఎం.డీ. విజయకుమార్ రెడ్డి కార్యక్రమం ఆసాంతం నిర్వహించారు.
బహుమతుల వివరాలు:
………………………………
2023 డిసెంబరు 29న జరిగిన నంది నాటకోత్సవ ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయబడ్డాయి.
ఉత్తమ గ్రంథం: రాయలసీమ నాటకరంగం (డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, విశ్రాంత ఆచార్యులు యోగివేమన విశ్వవిద్యాలయం కడప).
పద్య నాటకం:
…………………..
ఉత్తమ తొలి ప్రదర్శన – శ్రీ మాధవ వర్మ
ఉత్తమ ద్వితీయ ప్రదర్శన – శ్రీకాంత కృష్ణమాచార్య
ఉత్తమ తృతీయ ప్రదర్శన – వసంత రాజీయం
ఉత్తమ రచయిత – డా. మీగడ రామలింగస్వామి (శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం)
ఉత్తమ ద్వితీయ రచయిత – పల్లేటి లక్ష్మీకులశేఖర్ (శ్రీరామ పాదుకలు)
ఉత్తమ దర్శకుడు – డా. పి.వి.ఎన్. కృష్ణ (శ్రీ మాధవ వర్మ)
ఉత్తమ నటుడు – అంజిరెడ్డి (వసంత రాజీయం)
ఉత్తమ నటి – సురభి వెంగమాంబ (నర్తనశాల)
ఉత్తమ బాలనటులు – జి. జగన్, రంజిత్ రాజీవ (శ్రీ మాధవ వర్మ)
ఉత్తమ ప్రతినాయకుడు – వైఎస్ కుమార్ బాబు (సీతా కళ్యాణం)
ఉత్తమ సహాయ నటుడు – భాస్కర్
ఉత్తమ హాస్య నటుడు – ఎస్. డేవిడ్ రాజు (శ్రీకాంత కృష్ణమాచార్య)
ఉత్తమ సంగీతం – డి. మురళీధర్ (శ్రీకాంత కృష్ణమాచార్య)
ఉత్తమ రంగాలంకరణ – సురభి సంతోష్ (ఆనంద నిలయం)
ఉత్తమ లైటింగ్ – సురభి నిరుపమ (శ్రీకృష్ణ కమలపాలిక)
ఉత్తమ మేకప్ – ఎస్. శ్రీనివాసులు (శ్రీకృష్ణ కమలపాలిక)
జ్యూరీ బహుమతి – సిహెచ్.వి.వి.ఎస్. ఫణికుమార్ (శ్రీరామ భక్త తులసీదాసు)
సాంఘీక నాటకం:
…………………………
ఉత్తమ తొలి ప్రదర్శన - ఇంద్రప్రస్థం
ఉత్తమ ద్వితీయ ప్రదర్శన - ద ఇంపోస్టర్స్
ఉత్తమ తృతీయ ప్రదర్శన - కలనేత
ఉత్తమ దర్శకుడు - ఎం. రవీంద్రరెడ్డి (ఇంద్రప్రస్థం)
ఉత్తమ రచయిత - ఆకురాతి భాస్కరచంద్ర (ద ఇంపోస్టర్స్)
ఉత్తమ ద్వితీయ రచయిత - ఆకెళ్ళ (కలనేత)
ఉత్తమ నటుడు - గోవాడ వెంకట్ (ఎర్రకలువ)
ఉత్తమ నటి - ఎం. అనూష (ద ఇంపోస్టర్స్)
ఉత్తమప్రతి నాయకుడు - ఎమ్మెస్ చౌదరి (ఝనక్ ఝనక్ పాయల్ బాజే)
ఉత్తమ బాల నటి - ఆరాధ్య (ఝనక్ ఝనక్ పాయల్ భాజే)
ఉత్తమ సహాయ నటుడు - నాగేశ్వరరావు (విజ్ఞాన భారతం)
ఉత్తమ సంగీతం - సురభి నాగరాజ్ (ఎర్ర కలువ)
ఉత్తమ రంగాలంకరణ - పరబ్రహ్మాచార్య, శ్రావణకుమార్ (విజ్ఞాన భారతం)
ఉత్తమ లైటింగ్ - శివాబృందం (ఇంద్రప్రస్థం)
ఉత్తమ మేకప్ - వెంకట్ (ఝనక్ ఝనక్ పాయల్ భాజే)
జ్యూరీ ప్రదర్శన - ఎర్రకలువ
సాంఘీక నాటిక:
……………………
ఉత్తమ ప్రదర్శన – ఆస్తికలు
ఉత్తమ ద్వితీయ ప్రదర్శన – కమనీయం
ఉత్తమ తృతీయ ప్రదర్శన – చీకటి పువ్వు
ఉత్తమ నాటిక రచయిత – పి. మృత్యుంజయరావు (ఆస్తికలు)
ఉత్తమ ద్వితీయ నాటిక రచయిత – మునిపల్లె విద్యాధర్ (కమనీయం)
ఉత్తమ తృతీయ నాటిక రచయిత: వై. భాస్కరరావు (త్రిజుడు)
ఉత్తమ దర్శకుడు – నాయుడు గోపి (ఆస్తికలు)
ఉత్తమ నటుడు – ఎం. రవీంద్రరెడ్డి (అతీతం)
ఉత్తమ నటి – గుడివాడ లహరి (చీకటి పువ్వు)
ఉత్తమ ప్రతినాయకుడు: ఎ.వి. నాగరాజు (రాతిలో తేమ)
ఉత్తమ బాలు నటుడు: చిరంజీవి విగ్నేష్ (రాతిలో తేమ)
ఉత్తమ హాస్యనటుడు – యు.వి. శేషయ్య (పక్కింటి మొగుడు)
ఉత్తమ సహాయ నటుడు – వెంకటపతి రాజు (కొత్త పరిమళం)
ఉత్తమ సంగీతం – లీలా మోహన్ (అతీతం)
ఉత్తమ మేకప్ – కె. నూకరాజు (గమ్యస్థానాల వైపు)
ఉత్తమ లైటింగ్ – పీడీ ఫణీంద్ర (రాతిలో తేమ)
ఉత్తమ రంగాలంకరణ: థామస్ (నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?)
జూరీ ప్రదర్శన: అతీతం
కళాశాలల/ విశ్వవిద్యాలయాల నాటిక:
…………………………………………………….
ఉత్తమ ప్రదర్శన – ఇంకానా..?
ద్వితీయ ఉత్తమ ప్రదర్శన – కపిరాజు
తృతీయ ఉత్తమ ప్రదర్శన – ఉద్ధం సింగ్
ఉత్తమ రచన – డాక్టర్ పి. వివేక్ (ఉద్ధం సింగ్)
ఉత్తమ దర్శకుడు – ఆర్. వాసుదేవరావు (ఇంకానా)
ఉత్తమ యువ కళాకారుడు/ కళాకారిణి – ఎం. అనుషా (ఇంకెన్నాళ్లు)
నాటుకోత్సవాల లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అలాగే విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి శతాభివందనాలు మునుముందుగా ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను