
గుగూల్ తర్వాత పాపులర్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న స్టార్ మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా? శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం. గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పింస్తుంది. ఎంతో మందిని స్టార్స్ ని చేసింది. కొంతమంది స్టార్స్ ని కూడా యూట్యూబర్స్ ని చేసింది.
తమ ప్రతిభను, అభిరుచులను అందులో తమకున్న అనుభవాలను వీడియోలుగా రూపొందించి యూట్యూబ్ ద్వారా వారికున్న ప్రతిభాపాఠవాలను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ తద్వారా వేల నుండి లక్షలవరకు సంపాదిస్తున్న తెలుగు యూట్యూబర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సృజనాత్మకంగా ఆలోచించాలే కాని ఉపాధికి కాదేది అనర్హం అంటున్నారు నేటితరం. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఎవరో ఇవ్వాలి అనేవారు, కాని, నేడు తమ అభిరుచులే ఉపాధిగా వారే సృష్టించుకుంటున్నారు. టెక్నాలజీ పైన అవగాహన పెంచుకొని, అభిరుచికి సృజననల జతచేసి యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు వేదికగా మార్చుకుంటున్నారు.
ఈ ఛానలో విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, వంటలు, మొక్కల పెంపకం, సంగీతం, గానం, సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తులతో పాటు టెక్నాలజీ, వార్తలు – విశ్లేషణలు, విహారయాత్రలు, షార్ట్ ఫిలింలు, సరదా కబుర్లు ఇలా ఒకటేమిటి సకల కళల సమాహారం యూట్యూబ్.
వినోదానికి – విజ్ఞానానికి – కాలక్షేపానికి 90వదరకం వరకూ మెగజైన్లు పుస్తకాలకు మించిన సాధనం మరొకటి లేదు. సినిమాలు తర్వాత గత దశాబ్దంలో టీవి వాటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం సోషల్ మీడియా ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూట్యూబ్ వచ్చి పుస్తకాలు, పత్రికలు, సినిమాలు, టీవీలను మరచిపోయాలా చేసాయి. దీనికి ముఖ్యకారణం 3 మొబైల్ ఫోన్స్. జియో లాంటి సంస్థలు డేటాను అతి తక్కువ ధరకు అందించబడంతో కోట్లాదిమంది మొబైల్ యూజర్స్ తమ ఫోన్లలోనే సినిమాలు, షార్ట్ ఫిల్మ్ లు, టీవీ కార్యక్రమాలు, టిక్-టాలు చూస్తున్నారు. యూట్యూబ్ ప్రవేశంతో ఎన్నో కొత్త యూట్యూబ్ ఛానల్లు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
అతి తక్కువ ఖర్చులో, కేవలం ఒకరిద్దరు వ్యక్తులు నిర్వహించగలిగే తెలుగు ఛానల్స్ నేడు వేలాదిగా అందుబాటులో వున్నాయి. ప్రతిభ వుండాలేగానీ ఆకాశమే హద్దుగా అవకాశాలు సోషల్ మీడియాలో ఎన్నో…
య్యూటూబ్ లో తెలుగు – తేజాలు పేరుతో ఇంతకు ముందు ఆహారం-వంటలు, ఆరోగ్యం చెందిన య్యూటూబర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరోగ్యం – వైద్యం కు సంబంధించిన ఛానల్స్ నిర్వహిస్తున్న వారి గురించి తెలుసుకుందాం.
-కళాసాగర్ యల్లపు
_________________________________________________________________
ఆరోగ్యం – వైద్యం
మనిషికి కూడు, గుడ్డ, విద్య తర్వాత కావలసినది ఆరోగ్యం. అందుకే నేడు వైద్య రంగం ఇంతగా అభివృద్ది చెందింది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి డాక్టర్లు, హాస్పటల్స్ దాటి మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ఆరోగ్య సంబధిత సమాచారాన్ని అందిస్తున్నారు కొందరు డాక్టర్లు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.

Dr. Samaram
సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తెలుగు వారికి ముందుగా గుర్తోచ్చే పేరు డా. సమరంగారు. గత ఐదు దశాబ్దాలుగా ప్రజల్లో వున్న అనేక అపోహలను, అనుమానాలను నివృత్తి చేస్తూ చేస్తూ విజయవాడ లో వాసవ్య నర్శింగ్ హోం హాస్పిటల్ ద్వారా వైద్య సేవచేస్తూనే పత్రికలు, టీవీల ద్వారానే ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో డా. సమరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లో లైంగిక విజ్ఞానం పెంపొదిస్తున్నారు. ఇంకా మూఢ నమ్మకాల గురించి, నాస్తికత్వం గురించి చర్చలు నిర్వహిస్తారు. ఎన్నో సామాజిక ప్రయోజన కార్యక్రమాలు డా. సమరం మల్టీ ఛానల్ నెట్ వర్క్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం 6 లక్షల 95 వేలు చందారులున్నారు డా. సమరం యూట్యూబ్ ఛానల్ కు.
https://www.youtube.com/watch?v=SZJ9iRLNw6k&t=3s
Health Mantra

మంతెన సత్యనారాయణరాజు గారు చదివింది బి.ఫార్మశీ అయినా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్-విజయవాడలలో ఆరోగ్య ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు. టీవీ, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే వుంది అంటూ ప్రజల్ని చైతన్య వంతులను చేస్తున్నారు. ప్రకృతి జీవన విధానం ద్వారా మనం తాగే నీటి ప్రాముఖ్యతను, ఆహారం వండే పద్దతులను వివరిస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న వీరు Good Health, Dr. Manthena official పేరుతో రెండు ఛానల్స్ ను విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ కు 1.3 మిలియన్ చందారులున్నారు.
https://www.youtube.com/watch?v=kpP5L3_GcaY&t=413s
Natural Health Care
సుమన్ యూట్యూబ్ ఛానల్ వారు నేచురల్ హెల్థ్ కేర్ పేరుతో ప్రారంభించిన ఈ ఛానల్ లో ఆరోగ్య సమస్యలు, యోగా, జీవన విధానం లాంటి అనేక అంశాలకు సంబధిత నిపుణులచే వీడియోలు రూపొందించి అందిస్తారు. ఇందులో అనేక మంది డాక్టర్లు, ఆయా రంగాలలో నిపుణుల ఇంటర్ వ్యూలు, సూచనలు, సలహాలు వుంటాయి. ప్రస్తుతం 3 మిలియన్ల చందారులున్నారు.
https://www.youtube.com/watch?v=bnB72HAk4q8
Dr Gurava Reddy Annapareddy

కీళ్ళ మార్పిడి డాక్టర్ గా పేర్గాంచిన డా. గురవారెడ్డి అన్నపరెడ్డి గారు హైదరాబాద్ లో సన్ షైన్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. సంవత్సరానికి నాలుగు వేలకు పైగా కెళ్ళ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ గారు మంచి సాహితీ ప్రియులు, రచయిత. వీరు తన ఛానల్ ద్వారా వైధ్య సంబంధిత విషయాలే కాకుండా అనేక సామాజిక -సంస్కృతిక అంశాల గురించి కూడా చర్చిస్తారు. వీరు మంచి హస్య చతురత కల్గిన వారు కూడా. ప్రస్తుతం 60 వేల చందారులున్నారు.
https://www.youtube.com/watch?v=Mv0T7L6eU0w&t=31s
Dr Murali Manohar Chirumamilla

ఆయుర్వేద వైద్యంలో పేరొందిన డా. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు ఆరోగ్యం-అందం-ఆహారం ఈ మూడు ఆంశాల గురించి మూలికా వైద్య విధానాలను, ఆహార నియమాలను తన వీడియోల రూపంలో శాస్తీయంగా అందించి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2009 సం.లో ప్రారంభించిన ఈ యూట్యూబ్ ఛానల్ కు ఏడు లక్షల చందారులున్నారు.
https://www.youtube.com/watch?v=e4BAS-MedJQ
ఇంకా అనేకమంది లక్ష కు పైగా చందాదారులను కలిగివున్నవారున్నారు. మరి కొన్ని ఛానల్ పేర్లు, లింక్లు ఇక్కడ చూడండి….
Good Health …. https://www.youtube.com/watch?v=qMluWfCbj1E
Health Trends …. https://www.youtube.com/watch?v=pU5GbMCR93I
Health Qube ….. https://www.youtube.com/watch?v=4uaSax-VfNM
Dr. Ramachandra …. https://www.youtube.com/watch?v=rzCgaZvJ8ck
Happy Health …… https://www.youtube.com/watch?v=YvM4euj3prQ
Telugu superhumans … https://www.youtube.com/watch?v=DV_h8yEd8a4