అంతర్జాతీయ అంతర్జాల సదస్సు

హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు జులై 29, 30 తేదీల్లో “జ్ఞాన సముపార్జన మాధ్యమం మాతృభాష” అనే అంశం గురించి అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా ప్రముఖులు 25 మంది వివిధ రంగాలలో మాతృభాష ప్రాముఖ్యత గురించి మాట్లాడనున్నారు.
10.00 ఆహుతులకు ఆహ్వానం : ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు
10.10 జాతీయగీతం
10.12 అధ్యక్షులు : ఆచార్య పొదిలి అప్పారావు, ఉపకులపతి, హైదరాబాదు విశ్వవిద్యాలయం
10.20 ముఖ్య అతిథి: మాన్యులు ము.వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి, భారత దేశం
10.50 గౌరవ అతిథి : డా.జి.సతీష్ రెడ్డి, చైర్మన్, DRDO, హైదరాబాదు
11.10 ఆత్మీయ అతిథి : శ్రీ కె.ఎల్. వరప్రసాద రెడ్డి, చైర్మన్, శాంతాబయోటెక్ ఫార్మ కంపినీస్, హైదరాబాదు
11.30 శ్రీ ఎ. సత్యనారాయణ రెడ్డి, డైరెక్టర్, తెలుగు అకాడమి, హిమయత్ నగర్, హైదరాబాదు
11.40 ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి, డీన్, మానవీయ శాస్త్ర విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం
11.50:ఆచార్య జి.అరుణకుమారి, అధ్యక్షులు, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం 12.00 సదస్సు లక్ష్యం : ఆచార్య డి.విజయలక్ష్మి, సదస్సు నిర్వాహకులు, తెలుగుశాఖ, హై.వి.వి.
12.10 కీలకోపన్యాసం : ఆచార్య కోలవెన్ను మలయవాసిని, పూర్వాచార్యులు, తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వవిద్యాలయం, విశాఖపట్నం
12.30 వందన సమర్పణ : డా.బాణాల భుజంగరెడ్డి. తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం

29న ఉదయం జరిగే ప్రారంభ సభ విశిష్టమైనది. భారత ఉపరాష్ట్రపతి మాన్యులు యం. వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా ఉ.10.00కి అరగంట సేపు తమ ప్రసంగం చేయనున్నారు. ఆయన సమయపాలన గురించి మనకు తెలుసు కాబట్టి వెబినారుకు ఉ. 9.50 కల్లా (భారత కాలమానం) లాగిన్ అవమని నిర్వాహకులు కోరుతున్నారు. అందరూ ఆడియో మ్యూట్ లో ఉంచాలి, వీడియోలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలి.

గూగుల్ మీట్ లంకె ఇదీ :
https://stream.meet.google.com/stream/d3d1c014-2985-4189-9368-435a57826218

తెలుగు భాషకు సేవ చేయాలనే ఉత్సాహంతో ఉన్న ఈ సమూహ సభ్యులందరూ ఈ సదస్సుకు విచ్చేయాలని ఆహ్వానిస్తున్నారు నిర్వహకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap