తెలుగు శిల్ప కళా వైభవమా, విషాదమా?

ప్రతి నెల రెండవ మరియు నాల్గవ శనివారములలో రచ్చబండ కార్యక్రమము ‘అమ్మనుడి ‘ ని కాపాడుకొనుటకు నిలబెట్టుకొనుటకు జరుపుతున్నారు. ప్రతి సారి రచ్చబండ లో ఏదో ఒక విశేషత ఉంటున్నది, మనం తెలుసుకోవలసిన విషయములు కూడా చాలా ఉంటున్నవి. ఈ సారి కూడా ఎంతో ప్రాముఖ్యత గల అంశముతో రచ్చబండ జరగబోతున్నది. మీరు కార్యక్రమము తీరిక చేసుకొని తప్పక పాల్గొనగలరని వేడుకోలు.

తెలుగు శిల్ప కళా వైభవమా, విషాదమా?

అపూర్వమైన శిల్ప కళ సంపదను తెలుగు వారు సృష్టించారు.
ఇప్పుడు తమ నుడి, ఆటలు, పాటలు, కళలు, సంస్కృతికి దూరమౌతున్న నేపధ్యంలో తమ శిల్పకళ సంపదను వడిగా పోగొట్టుకొంటున్నారు. ఈ అంశం గురించి ఉపన్యసించే ఈమని శివనాగిరెడ్డి గారి గురించి తెలుసుకుందాం…

ఈమని శివనాగిరెడ్డి:
గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని వలివేరులో పుట్టిన శివనాగిరెడ్డి గారు, 1974లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్పకళాశాలలో సాంప్రదాయ ఆలయ నిర్మాణం, శిల్పకళలో నాలుగేళ్ళు శిక్షణ పొందారు. 1977లో అదే కళాశాలలో సహాయ నిపుడిగా పనిచేస్తుండగా, శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవాలయాల తరలింపు కోసం, దేవాదాయ శాఖలో శిల్పి, డ్రాఫ్ట్ మెన్ గా 1978 జూలై 1న
ప్రభుత్వోద్యోగంలో చేరారు. 1975లో అదే శాఖలో అసిస్టెంట్ స్థపతిగా పదోన్నతి పొందారు. 1979లో ప్రైవేటుగా ఎస్వీయూనివర్శిటీ నుంచి బి.కాం. డిగ్రీ తీసుకొన్నారు.

శ్రీ గణపతి స్థపతి ఆధ్వర్యంలో శ్రీశైల జలాశయ ముంపు ప్రాంతం నుంచి దేవాలయాల తరలింపు పనిలో ఉంటూనే 1982-84 మధ్య ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రంలో ఎం.ఏ. చేసారు. 1989-94 మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ అలోకాపరాశర్-సేన్ వర్యవేక్షణలో ‘ప్రాచీన మధ్య దేశంలో కట్టడకళ-సాంకేతికాంశాలు’ అన్న అంశంపై పరిశోధనలు గావించి పిహెచ్.డి. పట్టా పొందారు. 1979 నుంచే రచనా వ్యాసంగంలో నున్న వీరు 1995లో ఉస్మానియా నుండి పి.జి.డిప్లొమా ఇన్మస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చేశారు. చిన్నప్పుడు చదువుకొనసాగించలేకపోయినా, ఉద్యోగం చేస్తూనే జ్ఞాన సముపార్జన కోసం ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకొన్నారు. 2008-10లో ఎం.ఎస్. యూనివర్శిటీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎం.బి.ఏ. చేశారు.

1978లో దేవాదాయశాఖలో చేరి మహబూబ్ నగర్ల్లా లోని ప్రాగటూరు, మారమునగాలి, పల్లెపాడు, సాసనూరు, ఊటుకూరు, అలంపూరు మొదలైన
గ్రామాలలోని దేవాలయాల చిత్రాలను గీసి, నమూనా దేవాలయాలను తీర్చిదిద్దారు. 1979లో అలంపూర్‌లోని బుగ్గ రామలింగేశ్వరాలయం, ప్రాగటూరులోని రామలింగేశ్వరాలయం దేవాలయాలు, 1981లో జటప్రోలు, మల్లేశ్వరం, మంచాలకట్ట దేవాలయాలను ఊడదీసి, ఎగువ పునర్మించారు.

1990-92ల మధ్య కాకతీయులు నిర్మించిన గొడిశాల, నిడికొండ, రామానుజపురం, జాకారం దేవాలయాలు శిథిలం కాగా వాటిని ఊడదీసి పదిలపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెసు, ఎ.పి. హిస్టరీ కాంగ్రెసు లాంటి పరిశోధక సంస్థలలో జీవిత సభ్యునిగా కొనాసాగుతూ అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని తెలుగువారి చరిత్ర, సంస్కృతులపై అనేక పరిశోధక పత్రాలను సమర్పించారు. 1979 నుంచే రచనా వ్యాసంగం ప్రారంభించిన వీరు, ఇప్పటి వరకు తెలుగు, ఇంగ్లీషు భాషలలో 400లకు పైగా వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. సోమశిల దేవాలయాల చరిత్ర, ప్రాచీన బౌద్ధ శాసనాలు, ప్రాచీనాంధ్ర బౌద్ధ శిల్పులు, ఆంధ్రప్రదేశ్ లో కట్టడకళ, కొయ్య శిల్పుల గ్రామం, కొండపల్లి కోట, కాకతీయుల కళానిలయం- రామప్పదేవాలయం, తెలుగుశిల్పులు, తెలుగులిపి-భాష వంటి అనేక గ్రంథాలను రచించారు.

ఎప్పుడు ? ఎలా వినాలి ..?
12,000 ఏండ్ల తెలుగు శిల్ప కళ సంపద పెరుగుదల గురించి, ఇప్పుడు దానిని మనం పట్టించుకొనక పోవటం గురించి 26-12-20, శనివారం రాత్రి 7.00 గంటలకు (భారతీయ కాలమానం) వారు మాట్లాడుతారు. ఈ క్రింది లంకెను వాడి మీరు తెలుగు కూటమి రచ్చబండలో పాల్గొనండి:
meet.google.com/mbc-acrs-ecd

ఇండియా సమయానికి సరియగు పొద్దు మీ దేశములో ఏమిటో చూసుకొని రచ్చబండలో పాల్గొనగలరని వేడుకోలు.

1 thought on “తెలుగు శిల్ప కళా వైభవమా, విషాదమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap