స్వతంత్ర భారతావనికి ప్రతీక
మువ్వన్నెల జాతీయ పతాక
స్వతంత్ర భారతికి ఓ తెలుగువాడు
బహుకరించిన నూలు సువర్ణ పతకం – ఈ త్రివర్ణ పతాకం !
జాతీయ జెండా రూపొందించిన పింగళి వెకయ్య తెలుగు బిడ్డ
ఈ పింగళి పుట్టిన … భట్లపెనుమర్రు తెలుగుగడ్డ
స్వాతంత్ర అమృతోత్సవ వేళ – ఈ సంవత్సరమంతా అఖండ భారతావనిలో
ఇంటింటా ఎగరాలి మన జాతీయ జెండా – కావాలి ఇదే మనందరి ఎజెండా !!
జాతీయ పతాక పిత పింగళి ఆంధ్ర కీర్తిని విశాలాంధ్ర చేసినాడు
ఆంధ్రుల దేశభక్తిని ప్రపంచానికి చూపించాడు.
ఈ త్రివర్ణ సంగమం భారతీయుల ఐక్యతా చిహ్నం
ఈ జెండా ముడిసరుకు భారతీయ పత్తి !
పత్తికి ఇది జాతీయ ప్రతి పత్తి
ఈ పత్తి జెండా మన జాతీయ సంపత్తి
నాడు ఈ జెండా స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తి
నేడు ఈ జాతీయ జెండా స్వాతంత్ర దీప్తి!!
బి.ఎం.పి. సింగ్
పింగళి వెకయ్య : ఆర్టిస్ట్ చిత్రం సుధీర్