విద్యార్థుల్లో డిజిటల్ పెయింటింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రముఖ డిజిటల్ ఆర్టిస్ట్ జయశ్రీ ప్రభాకర్ అనుపోజు (హైదరాబాద్) నేతృత్వాన ఆన్లైన్ డిజిటల్ పెయింటింగ్ కాంటెస్ట్ ను నిర్వహించనున్నారు. ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువ సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి.
సబ్ జూనియర్స్(5,6,7 తరగతులు),
జూనియర్స్ (8,9,10 తరగతులు),
సీనియర్స్ (ఇంటర్,డిగ్రీ) విభాగాలలో ఈ పోటీలు జరగనున్నాయి. పోటీలలో పాల్గొనే విద్యార్థులంతా తమకు నచ్చిన అంశంపై డిజిటల్ ఆర్ట్ వేయవచ్చు. మీ ఆర్ట్ ను అక్టోబర్ 5 వ తేదీ లోగా ffadigitalpaitingcontest@gmail.com అనే అడ్రస్ కు తమ పూర్తి వివరాలు పొందుపరుస్తూ (చిరునామా, ఇ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ) పంపాలి. ఫైల్ సైజ్ 2 MB నుంచి 4 MB మధ్య ఉండాలి. వర్క్ ప్రాసెస్ ను నాలుగు స్టేజీలలో ఫొటోలు తీసి పంపాలి. అనంతరం అక్టోబర్ 7,8 తేదీలలో శ్రీ ప్రభాతాలు పేరిట డిజిటల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కం సేల్ ను ఏర్పాటు చేయనున్నారు. అందులో పోటీలలో విజేతులుగా నిలిచిన వారి చిత్రాలు కూడా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన బాలోత్సవ్ భవన్ (విజయవాడ, మొదటి అంతస్తు, రాఘవయ్య పార్క్ ఎదురుగా) లో జరుగనుంది.
– శ్రీనివాస్
excellent…thank you so much for your great support to promote digital art