రాజా రవివర్మ 174 వ జయంతి వేడుకలను రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నెల్లూరులో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి 29వ డివిజన్ కార్పొరేటర్. షేక్. సత్తార్ మాట్లాడుతూ ఒక చిత్రకారుని పేరుతో చారిటబుల్ ట్రస్టు నడుపుతున్నటువంటి రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భారతీయ చిత్రకళకు రాజా రవి వర్మగారు చేసిన కళాసేవ ను ఆయన కొనియాడారు. ఆయన జయంతిని ప్రతి చిత్రకారుడు చేసి ఆయనను స్మరించుకోవాల్సిన అటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు 1848లో జన్మించినటువంటి రాజా రవివర్మగారు ఆనాటి చిత్రకళ రూపాలను తనదైన శైలిలో వినూత్నంగా ఆవిష్కరించడం జరిగినది. అంతేకాకుండా కేరళ రాజుల ఆస్థాన చిత్రకారుడిగా పేరు పొంది వారి జీవిత విశేషాలు వారి ఆనాటి సాంప్రదాయాలు ఆనాటి విశేషాలను తన చిత్ర రూపాలతో ప్రపంచానికి తెలియ చేసినటువంటి గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మ. ఆయన కొనియాడారు.
1873లో జరిగిన వియన్నా కళాప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవివర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఇతను మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు. మరో అతిథిగా విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుడుముల సుబ్బారావు గారు మాట్లాడుతూ రాజా రవివర్మ రామాయణ, మహాభారతంలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. అని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, సుబాహాన్, రాజేష్, నారాయణ,మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.