నిప్పు + నీరు = ఆర్. ఆర్. ఆర్.

రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన తారక్
అటెన్షన్ క్రియేట్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాతే ఎవరైనా. తెలుగు నాట మళ్లీ రాజమౌళి వెలుగు ఎలా ఉంటుందో మన ఉగాది రుచి చూపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న ఆర్. ఆర్. ఆర్. పై మళ్లీ అటెన్షన్ క్రియేట్ చేశారు రాజమౌళి. షూటింగు మొదలుకుని సినిమా విడుదల దాకా ఆయన ముద్ర ఎలా ఉంటుందో ఎన్నోసార్లు చూశాం… మళ్లీ చూస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళికి వచ్చిన ఊహే కొత్తగా ఉంది. సాధారణంగా నిప్పు, నీరు కలవవు. ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? ఆవేశానికి ఆలోచన తోడైతే? ఈ ఊహే దర్శకధీరుడు రాజమౌళికి వచ్చింది. నిప్పు కణికలా భారతీయులపై తెల్లదొరల పెత్తనాన్ని ఎదిరించిన ఆవేశపరుడు, భయం అన్నది లేకుండా తూటాలకు ఎదురొడ్డిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును, నీరులా నిశ్చలమైన ఆలోచనలతో తెల్లదొరలను ఎదిరించిన తెలంగాణ గోండు వీరుడు, యోధుడు కొమరం భీమ్ ను కలిపారు. చరిత్రలో ఎప్పుడూ కలవని వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘ఆర్ఆర్ఆర్’ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఉగాది సందర్భంగా విడుదల చేశారు. తెలుగులో ‘ఆర్’ అంటే ‘రౌద్రం ‘. ‘ఆర్’ అంటే ‘రణం’! ‘ఆర్’ అంటే ‘రుధిరం’. మూడు ‘ఆర్’లను కలిపితే… ‘రౌద్రం రణం రుధిరం’ అన్నమాట. అదే టైటిల్ కన్నడలో ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రౌద్ర రణ రుధిర’, హిందీలో ‘రైజ్ రోర్ రివోల్ట్’, తమిళంలో ‘రత్తం రణం రౌధిరం’, మలయాళంలో ‘రౌద్రం రణం రుధిరం’ అని తెలిపారు. “అగ్నిని నీరు ఆర్పివేస్తుంది! నీరుని అగ్ని ఆవిరిగా మారుస్తుంది! అపారమైన బలంతో ఈ రెండు శక్తులు కలిసి వస్తున్నాయి” అని రాజమౌళి పేర్కొన్నారు. మోషన్ పోస్టర్‌లో మొదట నిప్పుకు చిహ్నం అన్నట్టు రామ్ చరణ్ ను, నీరుకి చిహ్నం అన్నట్టు ఎన్టీఆర్ ను పరిచయం చేశారు.
ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
భీమ్ పర్ రామరాజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా నిన్నఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు భీమ్ పర్ రామరాజు అనే వీడియో వచ్చిన విషయం తెల్సింది. ఇందులో అల్లూరి పాత్రను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చరణ్ బర్త్ డే వీడియో వచ్చింది. విజువల్స్ తో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆ వీడియో స్థాయిని పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సర్ ప్రైజ్ గిఫ్ట్ అని దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకన్నారో ఆ వీడియో చూస్తే అర్థమైంది. ఆయన మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రామరాజుగా రామ్ చరణ్ కనిపించిన తీరు అమోఘం. ఒక అసాధారణ శక్తిమంతుడిగా ఆ పాత్రను ‘రౌద్రం రణం రుధిరం’లో యస్.యస్. రాజమౌళి చూపిస్తున్నారని అర్థమైపోయింది. వీడియోలో రామరాజు పాత్రను భీమ్ పాత్రధారి అయిన తారక్ పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉంది. తెలుగుతో పాటు ఈ సినిమా విడుదలవుతున్న ఇతర భాషలు… తమిళ, కన్నడ, మలయాళం, హిందీలోనూ రామరాజు క్యారెక్టర్ ఇంట్రోను రిలీజ్ చేశారు.
“ఆడు నిలబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే యేగుసుక్క ఎగబడినట్టుంటది. ఎదురువడితే సావుకైనా సెమట ధార కడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి, సాకింది గోదారి, నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు” అని రామరాజు పాత్రను పరిచయం చేశాడు కొమరం భీమ్. తెలంగాణ యాసలో భీమగా రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తుంటే ఒళ్లు గగుర్పొడిచిందంటారే.. అలాగే అనిపించింది. “నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు” అంటూ ఆ పాత్రను భీమ్ పరిచయం చేసినదాన్ని బట్టి సినిమాలో రామరాజును భీమ్ అన్నగా సంబోధిస్తాడని అర్థమవుతోంది.
మలయాళంలో మినహా తెలుగు.. హిందీ… తమిళం.. కన్నడంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోనే చరణ్ బర్త్ డే వీడియో వచ్చింది. దాదాపు అన్ని భాషల్లో కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వీడియోకు హైల్కెట్ గా నిలిచిందనే కామెంట్స్ వచ్చాయి. ఒక స్టార్ హీరో ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చరణ్ బర్త్ డేకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పి మెప్పించాడు కనుక ఎన్టీఆర్ బర్త్ డే కు చరణ్ వాయిస్ ఓవర్ తో భీమ్ పాత్రను పరిచయం చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే జరుగబోతుంది. కొమురం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లూరి అయిన రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వీడియోను జక్కన్న విడుదల చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2 thoughts on “నిప్పు + నీరు = ఆర్. ఆర్. ఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap