రాజ‌మౌళి `రౌద్రం రణం రుధిరం`

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రానికి ‘రౌద్రం రుధిరం ర‌ణం’గా టైటిల్ ఖ‌రారు పోస్ట‌ర్ విడుడ‌ద‌ల‌.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఆర్.ఆర్.ఆర్. టీమ్ టైటిల్ సస్పెన్స్ క్లియర్ చేసి  టైటిల్ లోగో.. మోషన్ పోస్టర్ ని ఉగాది ఫర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు. దీనికి రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని ఖారారు చేశారు. దీంతోపాటు ఎన్టీఆర్.. రామ్ చరణ్ పాత్రల తీరుతెన్నుల్ని రివీల్ చేశారు. ఇరు పాత్రల్లో ఒకరు నీరు అయితే.. మరొకరు నిప్పు అన్న క్లారిటీనిచ్చారు. నిప్పునైనా ఆర్పేది నీరు. పంచభూతాల్లో ఇవి రెండూ ఆపోజిట్. అందుకే ఇలా ఆపోజిట్ గా పరిగెడుతున్నట్టుగా .. ఒకరికొరు ఢీకొని రణానికి సిద్ధమైనట్టుగా మోషన్ పోస్టర్ ని ప్లాన్ చేశారు. ఈ పోస్టర్ పై చరణ్ .. తారక్ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నా.. అదే సమయంలో మూవీ కంటెంట్ పై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అయితే మిస్టేక్స్ ని బయటపెడుతున్నారు. రంధ్రాన్వేషణ చేస్తున్నారు.
కొమురం భీమ్గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నపుడు అందుకు తగ్గ విధంగా పాత్రల్ని చూపించినట్టు లేదే అన్న మీమాంశ ఓ సెక్షన్ లో కనిపిస్తోంది. ఆ వేషధారణలు నేటి ట్రెండుకి తగ్గట్టు ఉన్నాయి కానీ నాటి లుక్ ఏదీ? అన్న ప్రశ్న వినిపించింది. 1920 ప్రాంతంలో తెలంగాణకు చెందిన గోండుల నాయకుడు కొమురం భీమ్.. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎవరికి కనిపించకుండా ఉత్తరాధికి వెళతారు. మరి అక్కడ వాళ్లిద్దరు ఏం చేశారనే కల్పిత కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు రాజమౌళి.

తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ అటు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ లో చిన్న పాటి సందేహాన్ని రాజేయడంతో అది కాస్త నిరాశకి గురి చేసింది. ఈ సినిమా టైటిల్ కోసం.. ఎన్టీఆర్- రామ్చరణ్ ఫస్ట్ లుక్ ల కోసం అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తుంటే కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయ్యాయి.
టైటిల్ పోస్టర్ ని తరచి చూస్తే కొన్ని లూప్హోల్స్ కనిపిస్తున్నాయని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు. టైటిల్ ఎంతో గొప్పగా ఉండబోతుందని భావించిన ఫ్యాన్స్ కి పూర్తి నిరాశని మిగిల్చారు. ఆర్ ఆర్ ఆర్ టైటిల్ బావున్నా పూర్తి ఫామ్ లో టైటిల్ మరీ అంత బాలేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇంతటి భారీ చిత్రంలో టైటిల్ పవర్ ఫుల్ గా ధ్వనించాలి. సౌండింగ్ పరంగా కొత్తగా ఉండాలి. కానీ ఆ రిధమ్ కనిపించలేదన్న విమర్శ కొందరిలో వ్యక్తమైంది. పైగా ఆయా పదాలని అతికించినట్టుగానే ఉన్నాయి. పలకడానికి ఏమాత్రం సౌకర్యవంతంగా లేదని అంటున్నారు.
మరోవైపు మోషన్ పోస్టర్ విజువల్ బ్రిలియన్సీతో ఆకట్టుకున్నా.. ఎన్టీఆర్.. రామ్ చరణ్ కి సంబంధించి లుక్స్ ఎలా ఉంటాయో చూడాలని ఎదురుచూస్తున్న ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కి చిన్నపాటి నిరాశని మిగిల్చాడు రాజమౌళి. వాళ్ళిద్దరిని ఈ మోషన్ పోస్టర్ లో కార్టూన్ బొమ్మలులాగా… వారి షాడోలనే చూపించారు. దీంతో తమ అభిమాన హీరోలు ఎలా ఉంటారో చూద్దామనుకున్న ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతోపాటు వీరిద్దరిలో రామ్ చరణ్ ప్రజెంట్ డేస్ ని తలపించే గెటప్ లో కనిపిస్తాడా? ఇంకేదీ స్పెషాలిటీ ఉండదా? అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. పైగా ట్రెండీగా ఇద్దరు షర్ట్ ధరించి పైగా చేతులకు మడత వేసారు. దీంతో ఇదొక పీరియాడికల్ చిత్రమనే సెన్స్ కనిపించడం లేదు. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ బ్రిటీషర్ల హయాంలో తిరుగుబాటు దారుడైన పోలీస్ గా కనిపిస్తున్నాడని చెబుతున్నారు కాబట్టి గెటప్ కూడా వెరైటీగానే ఉంది. అల్లూరి సీతారామరాజు ఎప్పుడూ పంచ కట్టుకునే ఉంటాడు. కానీ ఇందులో చరణ్ షర్ట్ ఫ్యాంట్ టిప్ టాప్ గా ధరించడం డౌట్ రెయిజ్ చేసింది. అంటే సీతారామరాజులో ఫిక్షన్ సైడ్ పూర్తి వేరుగా ఉంటుందని దీనర్థమా? ఇక అన్నిటికీ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే… మార్చి 27న చరణ్ పుట్టిన రోజు కానుకగా ఆయన ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడిన ఫ్యాన్స్ కి ఆరోజు ఏమైనా టిట్ బిట్ చూపిస్తారా? అన్నది చూడాలి.

అల్లూరి సీతారామరాజు ఎప్పుడూ గెడ్డంతో ఉంటాడు. కానీ ఇందులో నీట్ షేవింగ్ లో చరణ్ కనిపిస్తున్నాడు. అలాగే కొమురం భీమ్ క్లీన్ షేవ్ ఫోటోలే హిస్టరీలో కనిపిస్తే.. మూవీలో ఎన్టీఆర్ గెడ్డంతో కనిపిస్తున్నాడు. నీరు.. నిప్పు ఎంతటి బలమైనవో.. అవి రెండు కలిసిపోయే శక్తి ఉన్నాయనేది చూపించారు. కానీ ఇందులో ఒకరినొకరు ఢీ కొనబోతున్నట్టుగా చూపించడం షాక్ కి గురి చేస్తుంది. వీరిద్దరు ఎవరిపై పోరాటం చేయబోతున్నారనేది స్పష్టత ఇవ్వలేదు. ఇలా అనేక అనుమానాలను.. లాజిక్స్ ని వదిలేశారు. దీంతో తాజా మోషన్ పోస్టర్ పై సోషల్ మీడియాలో కొన్నిచోట్ల నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఆర్.ఆర్.ఆర్ కూడా బాహుబలిని గుర్తు చేస్తుందని.. ఏ మాత్రం కొత్తగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్.. చరణ్ ఫ్యాన్స్ మా హీరోనే గొప్పగా ఉన్నాడని ఎవరికి వారు సోషల్ మీడియాలో సంతోషపడుతున్నారు.
దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు- తమిళం- హిందీ వంటి భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్ కి జోడిగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ ఒలీవియా మోర్రీస్ నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ నటుడు సముద్రఖని కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap