పురస్కారాలకు చిన్న కథలకు ఆహ్వానం

జాతీయస్థాయి చిన్న కథలకు 12వ ‘సోమేపల్లి’ పురస్కారాలకు ఆహ్వానం
జాతీయ స్థాయిలో గత పదకుండేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో… నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే విజయవంతం చేయాల్సిందిగా అందర్నీ కోరుతున్నాము…

బహుమతులు వివరాలు –
అత్యుత్తమ కథకు రూ.2500/ఉత్తమ కథకు రూ.1500/
మంచి కథకు రూ.1000/
ప్రత్యేక బహుమతులు రూ.500/-చొప్పున ఇద్దరికి …
ఈ పురస్కారం కొరకు పంపే కథల నిడివి రాతప్రతిలో రెండు నుంచి ఐదు పేజీలలోపు, డి.టి..పిలోనైతే 2 పుటలు కాగితం ఒక ప్రక్కనే రాయాలి. ఎటువంటి ఎంట్రీ ఫీజులేని ఈ పోటీలకు ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. కథ పుటల పై రచయిత పేరుగానీ, ఆయా వివరాలు గానీ వుండకూడదు, కేవలం హామీపత్రం పై మాత్రమే రచయిత వివరాలు పేర్కొనాలి. కథలను మార్చి 10వ తేదీలోపు రమ్య భారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001 (సెల్:9247475975) అనే చిరునామాకు పంపాలి. విజేతలకు నగదు బహుమతులతో పాటు, శాలువా,
జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో ప్రత్యేక సభలో సత్కరించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap