విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్, ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ టీం సభ్యుడు గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ కు గత కొన్ని సంవత్సరాలుగా చిత్రకళాభివృదికై కృషిచేస్తూ రాష్ట్రం నలుమూలల పర్యటిస్తూ కళనీ..కళా సంస్కృతిని పెంపొందిస్తూ భావి తరగని చిత్రకళా సంపదను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ) జాతీయ పురస్కారాల మహోత్సవంలో భాగంగా విశిష్ట కళా బంధువు జాతీయ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసిందని, సోమవారం మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం ట్రస్టు చైర్మన్ పి. మధు, కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి లు తమ చేతులమీదుగా గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ కి అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
తన సేవలను గుర్తించి విశిష్ట కళాబంధువు పురస్కారానికి ఎంపిక చేసిన తెలుగు వెలుగు సాహితీ వేదిక సంస్థ వ్యవస్థాపక చైర్మన్ పాలోజు రాజ్ కుమార్, జాతీయ కన్వీనర్లు డాక్టర్. రంగిశెట్టి రమేష్, డాక్టర్. వలబోజు మోహనరావులకు స్ఫూర్తి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.