నాలుగు సంవత్సరాల బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు ప్రవేశ ప్రకటన
6 సంవత్సరాల క్రితం కడప లో ప్రారంభించిన యోగివేమన విశ్వవిద్యాలయం 120 మంది అధ్యాపకులతో అభివృద్ది చెందింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో వున్న రెండవ లళిత కళాశాల.
మారుతున్న కాలంతోపాటు ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను యోగివేమన విశ్వవిద్యాలయం ప్రారంభించి ప్రోత్సహిస్తోందని కులసచివులు ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డి అన్నారు. లలితకళల విభాగం నిర్వహిస్తున్న కోర్సులు, అర్హతలు, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు సమగ్రంగా తెలియజెప్పే బ్రోచరును ఆచార్య ఎం. రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకత, ఓపిక, సహనం ఉన్న విద్యార్థులకు లలితకళల కోర్సు ఎంతో ప్రయోజనమన్నారు. స్నాతకోత్తర కళాశాల తాత్కాలిక ప్రధానాచార్యులు డాక్టరు గులాం తారిఖ్ మాట్లాడుతూ బీఎఫ్ఏ కోర్సు అభ్యశిస్తే యానిమేషన్ పరిశ్ర మలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ప్యాషన్ డిజైనరు, జూయలరీ డిజైనింగ్ నిపుణులుగా, వృత్తికళాకారులుగా జీవితాలను ఉన్నతంగా మలచుకోవచ్చన్నారు. సామాజిక శాస్త్రాల ప్రధాన గురువులు ఆచార్య సాంబశివారెడ్డి మాట్లాడుతూ ప్రయోజనమైన కోర్సులు ప్రవేశ పెట్టిన ఘనత వైవీయూకే దక్కుతుందన్నారు. ఇంట ర్మీడియట్ ఉత్తీర్ణులైనవారు కోర్సులో ప్రవేశించవచ్చన్నారు. లలితకళల విభాగం సమన్వయకర్త కోట “మృత్యుంజయరావు మాట్లాడుతూ సమకాలీన పోటీ ప్రపంచంలో యువతకు అవకాశాలున్న కోర్సు ఇదన్నారు. పెయింటింగు, శిల్పం, గ్రాఫిక్స్ వంటి వాటిలో శిక్షణ ఇస్తామన్నారు. యోగివేమనయూనివర్సిటీ అంతర్జాలంలో దరఖాస్తు ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు మే 4వ తేదీగా నిర్ణయించామన్నారు. విశ్వవిద్యాలయంలో చేరిన విధ్యార్దులకు వసతి సౌకర్యం వుందన్నారు. రంగస్థల కళల అధ్యాపకుడు డాక్టరు మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలవ్యవధిగల రంగస్థల కళల కోర్సును అందిస్తున్నామన్నారు. వివరాలకు నం. 9492345419 సంప్రదించండి.