‘డమరుకం లలిత కళా సమితి’ నిర్వహించిన ధర్మచక్రం చరిత్రాత్మక పద్య నాటకం గ్రంథావిష్కరణ
గుంటూరు, అన్నమయ్య కళావేదిక శ్రీ వేంటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం బృందావన గార్డెన్స్ లో ఏప్రిల్ 18 వ తేదీ గురువారం సాయంకాలం గ్రంధావిష్కరణ జరిగింది. రచయిత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కార గ్రహీత చిటిప్రోలు వేంకటరత్నం గారు రచించిన ధర్మచక్రం చరిత్రాత్మక పద్య నాటకం. ఈ గ్రంథావిష్కరణ సభను ముందుగా ఆలయ అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య గారు జ్యోతి ప్రజ్వలన కావించి సభను ప్రారంభించుకున్నారు సభాధ్యక్షులుగా రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్ రచయిత లఘు చిత్ర దర్శకులు గన్నె వాసుదేవరావు గారు నిర్వహిస్తూ గ్రంథా ఆవిష్కరణ తుమ్మల కళాపీఠం కార్యదర్శి డాక్టర్ సూర్యదేవర రవికుమార్ గారు ఆవిష్కరించారు. సూర్యదేవర రవికుమార్ గారు మాట్లాడుతూ గేయాలు పద్యాలు గీతాలు ఎటువంటి సాహిత్యమైన అలవోకగా రాయగలరని ఈ గ్రంథం కూడా చాలా చక్కగా రచించారని కొనియాడారు. గ్రంథ సమీక్ష సారస్వత కళానిధి బిరుదాంకితులైన శ్రీమతి డాక్టర్ వలువోలు నాగరాజ్యలక్ష్మి గారు గ్రంథం మొదటి నుండి చివరిదాకా ఎంతో చక్కగా ప్రతి అంశాన్ని వివరిస్తూ వర్ణిస్తూ సమీక్ష చేశారు.
అనంతరం ప్రసంగ ప్రజ్ఞానిధి గుమ్మ సాంబశివరావు గారు అభినందనలు తెలియజేస్తూ చిటిప్రోలు వేంకటరత్నం గారు డిగ్రీ చదివే రోజుల్లో నేను కర్ర సాము నేర్చుకుంటున్నాను మిత్రమా అని చెప్పగా వెంటనే ఆ సన్నివేశంపై ఒక పద్యాన్ని రాసి చదివి వినిపించినటువంటి ఆ సందర్భం ఎన్ని సంవత్సరాలు అయినా మరిచిపోలేని విషయం. అంటే ఆ రోజుల్లోనే అంత చక్కగా పద్యం రాసి వినిపించారు. పద్యాలు గేయాలు రచించడంలో తనదైన ప్రత్యేక శైలిని కనపరుస్తారని ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమం డమరుకం దళిత కళా సమితి వారు చక్కగా నిర్వహించారని అభినందిస్తూ ముగించారు. తదుపరి బుద్ధ కథాగాన బ్రహ్మ విశ్వసంకీర్తన ఆచార్య శ్రీ తుర్లపాటి శంభాయాచార్యుల గారు ధర్మచక్రం గ్రంథంలోని ఒక పద్యాన్ని ఒక గేయాన్ని చక్కగా ఆలపించడం జరిగింది.
ప్రఖ్యాత రంగస్థలం నంది అవార్డు గ్రహీత ఎం. అర్జున్ రావు గారు అభినందనలు తెలియజేశారు.
రచయితకు డమరుకం లలిత కళా సమితి వారు సత్కారం చేశారు. ఇందులో భాగంగా డమరుకం లలిత కళా సమితి వారి నిర్వహణలో విద్యార్థులకు సన్నివేశం బుద్ధుని పై చిత్రలేఖన పోటీలను నిర్వహించి వారిలో చక్కని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు లిటిల్ స్టార్ట్ అవార్డు మెమొంటోలను అందజేశారు. పిల్లలు ఎంతో ఆనందంతో పొంగిపోయారు.
రచయితగా చిటిప్రోలు వెంకటరత్నం గారు వారి స్పందనని తెలియజేస్తూ ముందుగా అశోక పదం అన్న నాటకాన్ని సిద్ధార్థుడు బుద్ధుడుగా అయ్యేవరకు రాశానని బుద్ధుడు మహాపరి నిర్వాణం చెందేదాక ధర్మచక్రం అన్న పేరుతో రెండు భాగాలుగా రచించాను ఈ రెండు గ్రంథాలతో బుద్ధుడి పూర్తి జీవిత చరిత్రను రాయగలిగానని ఈ ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని డమరుకం లలిత కళా సమితి వారు చక్కగా నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
చివరగా అతిథులకు అందరికీ డమరుకం లలిత కళా సమితి వారు శాలువాలతో మో ఒక్క నిమిషంమెంట్లతో ఘనంగా సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమం ఢమరుకం లలిత కళాసమితి అధ్యక్షులు కన్నే వాసుదేవరావు గారు వ్యవస్థాపకులు వి. మల్లికార్జున చారి గారి నిర్వహణలో విజయవంతంగా జరిగింది.
-కె. శివకుమార్