చిత్రకళకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ మరియు జాషువా సాంస్కృతిక వేదిక వేస్తున్న అడుగుల్లో భాగమే ఈ ఆర్ట్ ప్యారడైజ్ ఈవెంట్.
ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో… నడిపల్లి రవికుమార్ శ్రీమతి రజని చౌదరి దంపతుల ప్రోత్సాహం తో… నవంబర్ 19, ఆదివారం
స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్, ఆర్ట్ మేట్-ది స్కూల్ ఆఫ్ ఆర్టిస్ట్స్, చిత్రం ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్
నిర్వహించిన ఆర్ట్ ప్యారడైజ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో 40 మంది విద్యార్థులచే 80 పెయింటింగ్స్ విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో చిత్రకళా ప్రదర్శనను ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కార్యదర్శి ఎం.వి.సాయిబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇన్నర్ వీల్ క్లబ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీమతి హరితా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మధ్యాహ్నం 1వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు “చిత్రకళా ప్రపూర్ణ” శ్రీ నడిపల్లి సంజీవరావు స్మారక చిత్రలేఖనం పోటీలు మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం మూడవ అంతస్తులో జరిగాయి. విజయవాడ మరియు పరిసర ప్రాంతాలనుండి 1000 మందికి పైగా చిన్నారులు ఈ ఆర్ట్ కాంటెస్ట్ లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.
బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి యల్లాజోషుల అనురాధ శిష్యబృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం చిత్రకళకు వన్నె తెచ్చిన డ్రాయింగ్ టీచర్స్ ఎమ్. లక్ష్మణబాబు, (గొల్లపూడి), గిరిధర్ నాయని,(రాజంపేట), తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు,(ముప్పవరం)లకు చిత్రకళా సంజీవ్ అవార్డులను డాక్టర్. నడిపల్లి రవికుమార్ శ్రీమతి రజని చౌదరి ల చేతుల మీదుగా అందించారు. తదుపరి ఆర్ట్ ప్యారడైజ్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 40 మంది చిత్రకారులను పతకాలు, జ్జాపికలు, ప్రసంశా పత్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం “చిత్రకళా ప్రపూర్ణ” నడిపల్లి సంజీవరావుగారి స్మారక చిత్రలేఖనం పోటీలు గెలుపొందిన విజేతలకు ప్రసంశా పత్రాలు, జ్ఞాపికలు, పతకాలు అందజేసారు. ఈ కార్యక్రమానికి అలకనంద రివర్ ప్రంట్ ఫౌండర్ చైర్మన్ ఏ.వి.ఆర్.చౌదరి గారు ముఖ్యఅతిథిగా, పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి యలమంచిలి దుర్గా భవాని, మనీషా డెంటల్ క్లినిక్ అధినేత డాక్టర్.కే.లక్ష్మీ సమీర, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం ప్రతినిధి పిన్నమనేని మురళీ కృష్ణ, జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు గౌరవ అతిధులుగా, డాక్టర్. నడిపల్లి రవికుమార్ శ్రీమతి రజని చౌదరీ లు ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు.
చిత్రలేఖనం పోటీలకు గిరిధర్ అరసవల్లి, ఎస్.పి.మల్లిక్, కళాసాగర్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, చిత్రం ఆర్ట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ చిత్రం సుధీర్, కార్యక్రమ నిర్వాహకుడు స్ఫూర్తి శ్రీనివాస్ లు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా మహిళా విభాగం కన్వీనర్ సంధ్యారాణి, వర్కింగ్ కమిటీ మెంబెర్స్ మేడా రజని, సౌజన్య, శ్రావణ్ కుమార్, రమేష్ అర్కాల ఇంకా పలువురు సీనియర్ చిత్రకారులు యువ చిత్రకారులు పాల్గొన్నారు.