బాలల దినోత్సవము సందర్భముగా చిత్రలేఖన పోటీలు డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ & అనంత్ డైమండ్స్ వారి ఆధ్వర్యములో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ విజయవాడ సంయుక్తంగా NTR & కృష్ణా జిల్లాల, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే పోటీలు.
తేదీ: నవంబర్ 14, ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు.
వేదిక : స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ప్రాంగణంలో, ఐటీఐ కాలేజీ ప్రక్కన, విజయవాడ-8 జరుగనున్నాయి. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ గత పది సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో అనేక కార్యక్రమాల ద్వారా చిన్నారులలో కళాభినివేశాన్ని పెంపొందించేదుకు ఫౌండర్ ప్రసిడెంట్ గా పి. రమేష్ కృషిచేస్తున్నాడు.
ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులకు టాపిక్స్ మరియు బహుమతుల వివరాలు:
——————————————————————————-
1 నుండి 5 వ తరగతుల వారికి – వారికి నచ్చిన అంశం
6 నుండి 7 వ తరగతుల వారికి – లాండ్ స్కేప్
8 నుండి 10 వ తరగతుల వారికి – పర్యావరణ పరిరక్షణ
1st and 2nd ఇంటర్ వారికి – పిక్నిక్
డిగ్రీ వారికి – National Integration
బహుమతులు: ప్రతీ తరగతి కి మూడు బహుమతులు, పది ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడతాయి.
ఈ పొటీలలో పాల్గోనే ప్రతి స్కూల్, కాలేజి విద్యార్థులకు ఎటువంటి ఎంట్రి పీజు లేదు.
ప్రతి పాఠశాల నుండి ఎంత మంది విద్యార్థులైనా ఈ పోటీలో పాల్గొనవచ్చును.
ఈ కాంపిటీషన్లో పాల్గోనే ప్రతి విద్యార్థికి డ్రాయింగ్ షీట్ మాత్రమే ఇవ్వబడును.
ఎవరి ఆర్ట్ మెటీరియల్ (కలర్స్ & పాడ్) వారే తెచ్చుకోవలెను.
ఈ పోటీలో పాల్గొనే ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.
ప్రతివిద్యార్థికి స్నాక్స్ ఇవ్వబడును.