చిల్లర భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కృషి సల్పుతున్న పరిశోధక రచయితకు ‘ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ఏటా ఇచ్చే’జ్ఞానజ్యోతి’ పురస్కారం 2023కి గాను ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డా. చిల్లర భవానీదేవికి ప్రకటించింది. కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం తదితర తెలుగు సృజనాత్మక రచనలతోపాటు అనువాదం ప్రక్రియలోనూ కేంద్రసాహిత్య అకాడమీ ప్రచురణలకు విశేష రచనలను అందించి బహుముఖ ప్రజ్ఞ కలిగిన భవానీదేవి కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎన్నికోబడ్డారు. ఈ పురస్కారం కింద్ర 3,000/- నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం, శాలువాలతో నవంబర్‌ 18వ తేది సాయంత్రం విజయవాడలోని మహాత్మగాంధీ రోడ్డులోగల ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో రచయిత్రిని సత్కరించనున్నారు..

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యకక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ సభలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ జమలపూర్ణమ్మ, రచయితల సంఘం ఉపాధ్యకక్షులు ఎ. జయప్రకాష్‌ తదితరులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం నెలకొల్పిన ఈ ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం అందుకున్న వారిలో భవానీదేవి మూడవ వారు. గతంలో రచయిత, పరిశోధకుడు గబ్బిట దుర్గాప్రసాద్‌, చారిత్రక పరిశోధకుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ అందుకున్నారు.

1 thought on “చిల్లర భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం

  1. అజ్ఞాన తిమిరాలను పారద్రోలే *జ్ఞానజ్యోతి*
    *చిల్లర భవానీ దేవి కి అభినందనలు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap