దార్శనికత గల కార్టూనిస్ట్ –  కరుణాకర్

కార్టూన్ అనేది… విశ్వభాష. అందుకే కార్టూన్ కు ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఒక చిన్న బొమ్మలో బోలెడన్ని భావాలను… ఆలోచనలను రేకెత్తించగలడు కార్టూనిస్ట్. అందుకే అన్ని దిన పత్రికలలో కార్టూన్ కు మొదటి పేజీలోనే స్థానం కల్పిస్తారు.

ఎందుకంటే…

కార్టూనిస్ట్ సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తాడు !
కార్టూనిస్ట్ సామాన్యుని కష్టాలను తన కార్టూన్లలో చూపిస్తాడు !!
కార్టూనిస్ట్ సామాజిక మార్పును కోరుకుంటాడు !!!

ప్రకాశం జిల్లా, కొప్పెరపాడు అనే చిన్న గ్రామంలో 1969 అక్టోబర్ 23 న పుట్టిన యెనికపాటి కరుణాకర్ కి చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం అంటే ఇష్టం. “బాల్యంలో పోలియో చికిత్సలో భాగంగా గోవా హాస్పిటల్ లో ఎలా పడుకుని ఉన్నాడో ? వివరిస్తూ తన కుటుంబ సబ్యులకు రాసిన ఉత్తరంలో వేసిన బొమ్మ తనలోని కళాకారున్నితట్టిలేపిందంటారు”.

పోస్టల్ కోచింగ్ ద్వారా బొమ్మలు గీయడం నేర్చుకున్న కరుణాకర్ తన మొదటి కార్టూన్ 1987 సం.లో ‘నవతరం ‘ మాసపత్రికలో అచ్చయ్యింది. అప్పటి నుండి విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఉదయం, ఆహ్వానం లాంటి పత్రికలలో ఎన్నో కార్టూన్లు గీశారు.

ఎం.ఏ., బి.ఇడి. చదువుకుని ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా వేలాది మంది పిల్లల భవిష్యత్ కు బాటలు వేసి, తన విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసి వారిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దారు.

ప్రగతిశీల భావాలు గల ఈ ఇంగ్లీష్ మాష్టారు మాతృక, అరుణతార వంటి అబ్యుదయ భావజాల పత్రికలకు ముఖచిత్రాలు, ఇలస్ట్రేషన్లు అందించారు. ఎయిడ్స్, పర్యావరణం పరిరక్షణ, పొల్యుషన్, గ్లోబలైజేషన్ వంటి పలు అంశాలపై నిర్వహించిన అనేకౌ అంతర్జాతీయ కార్టూన్ ప్రదర్శనలలో పాల్గొన్నారు. 2006 సం.లో ఇండియన్ ఇంక్.ఆర్గ్ మరియు సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి కార్టూన్ల పోటీలో అత్యుత్తమ బహుమతి అందుకున్నారు కరుణాకర్.

చిత్త ప్రసాద్ బొమ్మలను, మోహన్ కార్టూన్లను అభిమానించే కరుణాకర్ 2021 జూలై 18 న మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కరుణాకర్ కన్నుమూసి సంవత్సర కాలం గడిచిన సందర్భంగా ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులు ఒంగోలులో సంస్మరణ సభను నిరహించి ‘కరుణ కార్టూన్ల పుస్తకం’ ఆవిష్కరించారు.

కళాసాగర్

Cartoon on media

2 thoughts on “దార్శనికత గల కార్టూనిస్ట్ – కరుణాకర్

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link