“పచ్చని చేను పైట” కవితా సంపుటి రచయిత “కొండేపూడి వినయ్ కుమార్” మొదటి కవితా సంపుటి. సాహితీ గోదావరి వారు ప్రచురణ. 2023 డిసెంబర్ 24 న పుస్తక ఆవిష్కరణ శేరిలంక గ్రామంలో ఆ రచనకు తగినట్టుగా గ్రామీణ వాతావరణంలో “తరపట్ల సత్యన్నారాయణ గారి చేతులు మీదుగా జరిగింది. ఈ పుస్తకం తన తల్లి తండ్రులకు అంకితం ఇవ్వటం ద్వారా వారి మీద తన ప్రేమను రచయిత వ్యక్తం చేశారు. గోదావరి కవి ర్యాలి శ్రీనివాస్ ముందు మాట రాశారు. ఇందులో మొత్తం 59 కవితలు ఉన్నాయి. తెలుగు భాష మీద తన మక్కువ తాను మొదటి కవితలో వ్యక్తం చేయగా, అమ్మ ప్రేమ, నాన్న కష్టాన్ని, మధ్య తరగతి జీవితాలు గూర్చి, పల్లె సౌందర్యం, పల్లె ల్లో పండుగల సందడి, ప్రేమ సౌరభంతో పాటు మనసు చేసే మహా సంగ్రామం, తరిగిపోతున్న ప్రకృతి గురించి రాస్తూ “వసంతం రానంటోంది” అంటారు. “ఊరు పిలుస్తోంది” అని పల్లె పిలుపు మనకందించారు. “నా గుండె చప్పుడు”, “ఒంటరి”, “ఓ నా ప్రాణమా”, సముద్ర దర్శనం” కవితలు నవీన్ కుమార్ లోని భావుకతను పరిచయం చేస్తాయి. విప్లవ వీరుడు, అంబేద్కర్, సమైక్య భారతం గురించి వ్రాయటంలో అతని దేశభక్తి వ్యక్తం చేసారు.”గురువే మొదటి దైవం” అంటూ “డబ్బే జీవితం కాదు” అంటారు.
ఈ కవితా సంపుటిలో రచయిత భావావేశం, పల్లె మీద ప్రేమ, ప్రజలు కష్టాలు మీద సానుభూతి కనిపిస్తుంది. అయితే మరికొంచెం కవిత్వీకరించి ఉంటే బాగుండేది అనిపించింది. మొదటి అడుగు వేసిన కొండేపూడి వినయ్ కుమార్ మరిన్ని మంచి రచనలు చేయాలని, ఆ దిశగా కృషిచేయాలని కోరుకుంటున్నాను.
–శిరిపురపు అన్నపూర్ణ
ప్రతులకు:
పుస్తకం పేజీలు 72, ధర 100/-
కొండేపూడి వినయ్ కుమార్- 8008198944
రచయిత పేరు వినయ్ కుమార్ అయితే నవీన్ కుమార్ అని దిగువన అచ్చు అయినది, మరియు సమీక్ష వ్రాసిన వారి పేరు శిరిపురపు అన్నపూర్ణ, కానీ పాతూరి అన్నపూర్ణ గారి పేరు అచ్చు అయినది. రెండు మారాయి.
మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదములు 🙏💐☀️