80 ప్లస్ లో మురళీమోహన్

తెలుగులో హీరోగా ఒక్కో అడుగు వేసుకుంటూ .. అటుపై బిజీ హీరోగా ఆ తరువాత పాపులర్ హీరోగా ఇమేజ్ అందుకున్న నటుడు మురళీమోహన్. 1970 దశకం నుంచి 80 దశకంలో హీరోగా మురళీ మోహన్ సినిమాలు చాలానే వచ్చాయ్.. శోభన్ బాబు తర్వాత అంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మురళీ మోహన్ సొంతం. హీరోగా క్రేజ్ తగ్గాకా క్యారెక్టర్ యాక్టర్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మంచి నాన్న, మంచి మామయ్య, మంచి అధికారి అనేలా తనదైన సాఫ్ట్ నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పటికి లేడీస్ లో మురళీమోహన్ కు ఉన్న ఫాలోయింగ్ వేరు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి అందనంత ఎత్తుకు ఎదిగారు. సినిమా రంగంలో అయన ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలిచారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్ళపాటు ప్రజలకు సేవ చేసారు. కానీ అయన మనస్తత్వానికి రాజకీయాలు సరిపడలేదు. ప్రత్యర్థ పార్టీల ఆరోపణలతో అయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నటుడిగా, నిర్మాతగా, బిజినెస్ మెన్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ లీడ్ చేసిన అయన జన్మదినం జూన్ 24 (81 వ పుట్టినరోజు). ఈ సందర్భంగా అయన గురించి ప్రత్యేక కథనం.

బాల్యం ..
ఎడ్యుకేషన్ మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. 1940, జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఇతని తండ్రి మాధవరావు స్వాతంత్ర సమరయోధుడు. విద్యాభ్యాసం మొత్తం ఏలూరులో గడిచింది. 1963లో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. తరువాత విజయవాడలో నాటకాలలో నటించడం మొదలు పెట్టి ఆ తరువాత చెన్నై వెళ్లి అక్కడ సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. మురళీమోహన్ కు భార్య విజయలక్ష్మి. వీరికి మధుబిందు అనే కుమార్తె, రామమోహన్ అనే కుమారుడు ఉన్నారు.

సినిమా ఎంట్రీ ?
1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో మురళీమోహన్ సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాలో నటునిగా మంచి గుర్తింపు దక్కింది. ఆ తరువాత దాదాపు 350 తెలుగు చిత్రాలలో నటించాడు. జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించాడు. నేషనల్ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు. 2016 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తరువాత రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగు దేశం పార్టీలో చేరాడు. 2009 లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. తిరిగి 2014లో 16వ లోకసభ ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు..

నాకు రాజకీయాలు వడవు!
సినిమా వాళ్లు రాజకీయల్లో ఇమడలేరు అనేది వాస్తవం. మావి చాలా సున్నితమైన మనసత్వాలు అద్దాలంటే ఇళ్లు ఎవరైన బయట నుంచి ఒక్క రాయి విసిరిన అవి పగిలిపోతాయి. అలా పగిలిపోతే మేము తట్టుకోలేము. దాదాపు 10 ఏళ్ల నా రాజకీయ జీవితంలో చాలా మంచి పనులు చేశాను. అయినప్పటికి నేను అవినీతి చేశానని నా పై ప్రతిపక్ష పార్టీలు బురద చల్లారు. ఆ విమర్శలు నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఈ రాజకీయాల నుండి తప్పకున్నాను. ఇక నటన అంటారా మంచి పాత్ర దొరికితే మళ్లీ నా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను. నాకు సరిపోయే పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పూర్తిగా రాజకీయాలను వదిలేశానని సినిమా ఇండస్ట్రీలో ఇంకా తెలియలేదు. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఎవరైన మంచి కథలతో వస్తే తప్పకుండా ఒప్పుఉంటాను. దాంతోపాటు మా జయభేరీ నిర్మాణ సారధ్యంలో మంచి కథ దొరిగితే మళ్లీ ఒక మంచి సినిమాతో మీ ముందుకొస్తాను. ప్రస్తుతం రాజకీయాలను పూర్తిగా వదిలేశాను. ఒక పై నా జీవితం మొత్తం సినిమాతోనే ఉంటాను. రాజకీయల్లోకి వెళ్లి తప్పుచేశాను అని అంటున్నారు ప్రముఖ సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్.
-శ్రీను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap