రైతు ఆక్రందన – చిత్ర ప్రదర్శన

విజయవాడలో ఈ నెల 18 న చిత్ర ప్రదర్శన – విజేతలకు బహుమతి ప్రదానం
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
కళకి సామాజిక ప్రయోజనం ఉండాలనే ముఖ్య ఉద్దేశ్యంతో… సామాజిక బాధ్యత కలిగిన సంస్థలుగా ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ & జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అనే అంశంపై చిత్రకారులకు నిర్వహించిన ఆర్ట్ కాంటెస్ట్ కి రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందనతో పాటు ఆకట్టుకునే చిత్రాలు వచ్చాయి.. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతల చిత్రకారుల వివరాలు ప్రకటించారు నిర్వహకులు.

ప్రధమ బహుమతి (5,000/- నగదు బహుమతి)
వజ్రగిరి జస్టిస్, వినుకొండ

ద్వితీయ బహుమతి (3,000/- నగదు బహుమతి)
ఎన్.ఆర్. కుమార్, మండపేట

తృతీయ బహుమతి (2,000/- నగదు బహుమతి)
షేక్ నదియా, మైలవరం

ప్రోత్సాహక బహుమతులు (ఒక్కొక్కరికి 1000/- నగదు బహుమతి)
పి. ధనుష్య, విజయవాడ
ఎన్. ప్రసాద్, మండపేట
పి. రేణుకేశ్వర్, ఏలూరు

ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి అందరి చిత్రాలతో ప్రదర్శన మరియు విజేతలకు బహుమతి ప్రదానోత్సవంతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ, రాఘవయ్య పార్క్ ఎదురుగా బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తులో అందజేయబడతాయి.

చిత్రకళా ప్రదర్శనను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాతావరణ శాస్త్ర నిపుణులు డా.ఎస్.బి.ఎస్. నరసింహారావు లాంఛనంగా ప్రారంభిస్తారు.
జాషువా సాంస్కృతిక వేదిక అధ్యక్షులు ఎ. సునీల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించబడుతున్న సభా కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది విష్ణుబొట్ల లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ఎం. సూర్యనారాయణ, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ జనరల్ సెక్రటరీ స్ఫూర్తి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నుంచి ఎం. హరిబాబులు అతిథులుగా పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap