కోవెలమూడి రాఘవేంద్రరావు తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు గా తనదైన ముద్ర వేశారు. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్లు మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాఘవేంద్రరావు గారు మే 23న 1942 లో కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించారు. రాఘవేంద్రరావు గారి తండ్రి కోవెలమూడి ప్రకాశరావు కూడా సినీ దర్శకుడే. కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి లు నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి. నాగార్జున, రాజశేఖర్, బాలకృష్ణ, వండి అందరి స్టార్ హీరోస్ తో సినిమాలు డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.
అంతేకాక స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు కూడా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. అటు కమర్షియల్ సినిమాలతో పాటు అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను కూడా డైరెక్ట్ చేసారు రాఘవేంద్రరావు. అప్పట్లో రాఘవేంద్ర సినిమా వస్తుంది అంటే ఆయన మేకింగ్ చూసి ఆయనకు అభిమానులుగా మారిన ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉండేవి. ఆయన ప్రత్యేక శైలి నేటి తరం దర్శకులకు ఆదర్శం. రాఘవేంద్రరావు శిష్యుడిగా వచ్చిన ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ గా వున్నారు. రాఘవేంద్రరావు గారి కుమారుడు కోవెలమూడి ప్రకాష్, అతను కూడా సినీ రంగంలో నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా కూడా వ్యవరిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు గారు కేవలం వెండితెర మీదే కాక బుల్లితెర మీద కూడా తనదైన ముద్ర వేశారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో ఎన్నో ఏండ్లు టెలికాస్ట్ అయిన శాంతి నివాసం అనే సీరియల్ కు రచయిత గాను, దర్శకత్వం పర్యవేక్షకుడిగాను వ్యవహరించారు. రాఘవేంద్రరావు గారు చేసిన సినిమాలు, వాటి మేకింగ్ లను వివరిస్తూ ఈటీవీలో సౌందర్యలహరి అనే పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమై అది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.
ప్రస్తుతం ‘పెళ్లి సంద D’తో దర్శకేంద్రుడి సందడి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రస్తుతం ‘పెళ్లి సంద D” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1996లో విడుదలై ఏడాది పాటు ప్రదర్శించబడి అద్భుత విజయాన్ని సాధించడమేకాక పాతికేళ్లుగా బిగెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది నాటి పెళ్లి సందD’లో శ్రీకాంత్ హీరోగా నటించగా.. నేటి ” పెళ్లి సందరిలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఇది ఆ పెళ్లిసందడికి సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త కథ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, స్వరవాణి కీరవాణి కాంబినేషన్లో అప్పటి పెళ్లిసందడిపాటలు ఇప్పటికీ ప్రజాదరలు పొందుతున్నాయి. ఈ ‘పెళ్లి సంద D” కి కూడా కీరవాణి సంగీతం అందించడం మరో విశేషం. ఈ ‘పెళ్లి సంద D” పాటను ఏప్రిల్ 28న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రోషను బోడీగా శ్రీలీల నటిస్తోంది.