
(శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’)
శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ఆధ్వర్యంలో ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ‘ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారి నిర్వహణలో విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో 09-10-2022 ఆదివారం సా. 6:00 గంటలకు ఘనంగా జరిగింది. శ్రీశ్రీ సాహిత్యనిధి కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ గారు ముఖ్యఅతిథులను పరిచయం చేస్తూ వేదిక మీదకు ఆహ్వనించారు. సభాధ్యక్షులుగా శ్రీ కొల్లూరి గారు వ్యవహరిస్తూ శ్రీశ్రీ గారి గురించి తనకున్న అనుబంధం, అయనమీదున్న అభిమానం తెలియజేశారు. శ్రీశ్రీ గారి బొమ్మల పోటీలో చిత్రకారులు వేసిన చిత్రాలను పుస్తక రూపంలో ముద్రించడం ఎంతో సంతషంగా ఉందన్నారు. ఈ బోమ్మల పోటీ విజేలకు పారితోషికం, పుస్తక ముద్రణ వ్యయం చేసిన శ్రీశ్రీ సాహత్యనిధి కన్వీనర్ అశోక్ కుమార్ గారిని అభినందించారు. ఒక కవిని ఇంతగా అభిమానించే వ్యక్తులు చాలా అరుదుగా వుంటారన్నారు. ఒక కవి గురించి ఇప్పటికి 140 కి పైగా పుస్తకాలు ప్రచురించిన అశోక్ కుమార్ గారు అభినందనీయులన్నారు.
‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ విశేష సంచికను’ పుస్తకావిష్కరణ గిరిధర్ గారి చేతులమీదుగా ఆవిష్కరించారు. అలాగే ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’లను నిర్వహించి, పోటీ చిత్రాలతో అందంగా పుస్తకం రూపొందించిన కళాసాగర్ గారిని అభినందించారు. కళాసాగర్ గారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిత్రకారులను ఎప్పుడూ ప్రొత్సహిస్తున్నారన్నారు. ఈ పుస్తకాన్ని చలపాక ప్రకాష్ గారు సమీక్షచేస్తూ చిత్రకారులు అనేక రకాలుగా చిత్రించిన పోట్రయిట్స్ – కేరిరేచర్స్ చాలా అధ్భుతంగా ఉన్నాయన్నారు. అనంతరం ముఖ్యఅథిదిగా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారి చేతులమీదుగా పోట్రయిట్స్ ప్రధమ బహుమతి అంతోటి ప్రభాకర్, ద్వితీయ బహుమతి కొత్త రవీంద్ర, తృతీయ బహుమతి బాబ్జీ కె. మాచర్ల. కేరికేచర్లో ప్రథమ బహుమతి రాజు మొట్టు, ద్వితీయ బహుమతి మధు మందా, తృతీయ బహుమతి రాజశేఖర్ మరియు 12 మందికి ప్రోత్సాహక నగదు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం కైలే అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే రచనలు అవసరం వుందన్నారు. ఆ దిశలో రచయితలు కృషిచేయాలన్నారు.
శ్రీశ్రీ బొమ్మల పోటీ నిర్వహకుడు, 64కళలు.కాం ఎడిటర్ కళాసాగర్ గారు మాట్లాడుతూ ఈ పోటీలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల నుండి, అమెరికా నుండి సుమారు 154 మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. శ్రీశ్రీ సాహిత్యనిధివారికి, చిత్రలేఖనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అబినందనలు తెలియజేశారు. ఎక్స్ రే కార్యదర్శి ఆంజనేయరాజుగారు వందన సమర్పణతో సభను ముగించారు.
ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలనుండి అనేకమంది చిత్రకారులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
-మల్లిఖార్జునాచారి




