బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

మనిషి జీవితంలో మరలా తిరిగిరాని ఒక మధురమైన జ్ఞాపకం బాల్యం  అని చెప్పవచ్చు.
అలాంటి బాల్యస్మృతుల్ని వల్లించమంటే నేటి తరానికి వెంటనే గుర్తుకు వొచ్చే పదాలు...

ఏ ఫర్ ఏపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ కాట్,లేదా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు అర్. ఇంకా జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నోపాపా అంటూ కాన్వెంట్ లో టీచర్లు బట్టి పట్టించిన అర్డంలేని ఆంగ్ల పదాలు. వాటిని మన పిల్లలు ఇంటి దగ్గర వల్లే వేస్తుంటే అబ్బో మా పిల్లడు ఆంగ్లాన్ని అప్పుడే అవపోషణ పట్టేసాడన్నంతగా మురిపోతున్న నేటి మన తల్లి దండ్రులు, ఇంకా అమ్రుతమయమైన అమ్మ,నాన్న అన్న పదాలనే అర్దంలేని అనాగరిక పదాలుగా భావిస్తూ ఆ పదాలకు బదులు మృత పదాలైన  మమ్మీ డాడి అని పిలుపించుకుంటూ మైమరిచిపోతూన్న తరం మనది. హాయిగా ఆనందంగా ప్రకృతిలో విహరిస్తూ నచ్చిన ఆటలు వ్యాయామం,కసరత్హులతో దేహాన్ని గట్టిబరచవల్సిన వయసులో పిల్లాడు కాన్వెంట్ టింగ్ లీసు చదువులతో అలసిపోతున్నాడని వాడిని స్మార్ట్ గా పెంచాలనే భావంతో చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్లు  చేతికిచ్చి కాండి క్రాష్, టాకింగ్ డాల్,లాంటి గేమ్స్ తో దేహం అలవకుండా సున్నితమైన తన చేతులతో సెల్ఫోన్ లో ఆటలు ఆడుకుంటుంటే చూసి మైమరిచి మురిసి పోతున్న తరం మనది.

స్వచ్చమైన పూ దోటలో విహరించే రంగురంగుల సీతాకోకచిలుకల్లా టింగు రంగా అంటూ ఆడుతూ పాడుతూ అందంగా ఆనందంగా గడపిన మొన్నటి తరం యొక్క అందమైన బాల్యాన్ని నేటి తరం కోల్పోతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అందుకే ఆనాటి అందమైన ఆరోగ్యకరమైన బాల్య స్మృతులను నేటి తరానికి పరిచయం చేయాలనే సంకల్పానికి తన చిత్రకళా నైపుణ్యంను జోడించి నాటి అందమైన బాల్యాన్ని సుందరమైన చిత్రాల రూపంలో ఈసెప్టెంబర్ నెల 13నుండి 26వరకు హైదరాబాద్ ఐకన్ అర్ట్ గాలరీలోCHILD HOOD VIGNETTES పేరుతో అలనాటి అందాల బాల్య ప్రపంచాన్ని మనకు చూపిస్తున్నాడు విశాఖ జిల్లా చేర్లోపాలెం గ్రామానికి చెందిన చిత్రకారుడు రాజా రాంబాబు. రండి మీరే కాదు మీ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. వ్యాపార దృష్టితో సాగే కాన్వెంట్ చదువుల పుణ్యమా అంటూ మనము ఎంతటి విలువైన బాల్యాన్ని కోల్పోతున్నామో తెలుసుకుందాం. కాన్వాస్ పై రంగులతో అతడు సృష్టించిన అలనాటి అందమైన బాల్యాన్ని కనీసం చూసైన ఆనందిద్దాం రండి.

అతని చిత్రాలు మనలిని మరలా అయిదేళ్ళ వయసుకు తీసుకుపోతాయి,ఇసుకతిన్నెలపై గుజ్జెన గూళ్ళు కట్టిస్తాయి వాన నీటిలో తడిసి గెంతులు వేయిస్తాయి. కాగితపు పడవల్ని వాన నీటిలో వదల్తూ  ఆనందపడేలా చేస్తాయి.కర్రా బిల్లాటలు ఆడిస్తాయి,  గెంతాట ,గుజ్జేనగూల్లు,బస్సాట, రైలాట.టైరాట ఒకటేమిటి ఇంకా ఎన్నో ఆటలు మీ చేత ఆడించి అలసి పోయేలా చేస్తాయి. అంతేకాదు తూనీగల్నీ,సీతాకోక చిలుకల్ని పట్టిస్తాయి.చేట్లేక్కించి కోతి కొమ్మచ్చులాడిస్తాయి. రహస్యంగా మేకను పట్టుకుని పాలను తాగేలా చేస్తాయి.బర్రెలపై విహరింపజేస్తాయి.గేలంతో చేపలు పట్టిస్తాయి తాటి కాయలతో చక్రాల బళ్ళు చేయించి పరుగు పందాలు పెట్టిస్తాయి.సీట్ పై కాకుండా పెడల్ పై కెక్కి సైకిల్లు తోక్కిస్తాయి.ఇలా ఎంతో వ్యాయామం ఎన్నో కసరత్తులు మీ చేత చేయిస్తాయి. ఒక అందమైన ఆనందలోకానికి తీసుకుని వెళ్తాయి.

తూర్పు గోదావరి లోని పట్టణం తునికి చివర్లో విశాఖ జిల్లాకి ఆరంభంలో వుండే ఒక స్వచ్చమైన పల్లెటూరు చెర్లోపాలెం. కాన్వెంట్ బళ్ళఅంటురోగం ఇంకా ఆనాటి పల్లెటూర్లకు తాకని ఆ కాలంలో తన  బాల్యమంతా అక్కడే గడిపిన ఈ చిత్రకారుడు నేడు చిత్రాల రూపంలో వేసిన ఆటలన్నీ స్వయంగా ఆడి, పాడి ఆనందించిన అనుభవం తనది. వాటి మాధుర్యాన్ని తనివితీరా తన బాల్యంలో అనుభవించిన వ్యక్తి. తర్వాత కళాశాల చదువులకై అనకాపల్లి,ఆపై స్నాతకోత్తర విద్యకోసం ఆంద్ర విశ్వకళా పరిషత్ నందు మాతృభాషలో ఎం.ఏ. చేయడమే గాకా బాల్యం నుండే తనలో గల చిత్రకళాభిలాషతో అదే యూనివర్సిటీలో చిత్రకళా విద్యలో బి.ఎఫ్.ఏ. మరియు నాటక కళమీద ఆసక్తితో మరల డిప్లమో ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్స్  ఆపై స్నాతకోత్తర విద్య ఎం.ఎఫ్.ఏ, కూడా చేసారు. తదుపరి రిషి విద్యాలయ గురుకులం, గ్లండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాదు లాంటి ప్రఖ్యాత  విద్యాలయాలలో కొంతకాలం ఆర్ట్ టీచర్ గా పనిచేసారు. అంతే గాకా థియేటర్ ఆర్ట్స్ అనుభవంతో ఈ టివీ ప్లస్ చానల్ వొచ్చే అల్లరే అల్లరి., లైఫ్ ఈస్ బ్యూటిఫుల్,నేను తను,అమ్మయి క్యూటు అబ్బాయి నాటు లాంటి టెలి సీరియల్స్ తో బాటు మహానటి,గూడచారి,బ్రాండ్ బాబు, గీత గోవిందం,శ్రీరస్తూ శుభమస్తు,కళ్యాణ విభోగమే, లాంటి ఎన్నో సినిమాలలో కూడా నటిచారు నేటికి నటిస్తున్నారు.

చిత్రకారుడిగా MEMORIES OF MY CHILD HOOD  పేరుతో 2006 తన తొలి వ్యక్తి గత ప్రదర్శనను చిత్రమయి స్టేట్ ఆర్ట్ గాలరి హైదరాబాదు నందు ప్రముఖ సినీ హాస్యనటులు ధర్మవరపు సుభ్రహ్మణ్యం ప్రారంబించగా ఆ తర్వాత 2007లో అవర్ ప్లేస్ రెస్టారెంట్ నందు 2010లో ISB గచ్చిబౌలి లోను. తర్వాత 2019 లో విశాఖ హెరిటేజ్ ముజియం విశాఖపట్టణం లోను మరల బియాండ్ కాఫీ హైదరాబాద్ నందు వ్యక్తి గత చిత్రప్రధర్సణలు చేయగా సామూహికంగా కళా భవన్ న్యూ డెల్లి, చెన్నై,బెంగుళూరు, అహమదాబాదు,ఇండోర్, త్రివేండ్రం,హైదరాబాద్ , విశాఖపట్నం మొదలగు పట్టణాలతో బాటు అంతర్జాతీయంగా 2012 లో కొలరాడో USA లోను 2013 లో లాగోస్,నైజీరియ మరియు చైనా నందలి క్సియాన్ పట్టణంలోను తన చిత్రాలను ప్రదర్శించడం జరిగింది.

ఇంతవరకు MEMORIES OF MY CHILD HOOD, బుద్ధ, మరియు నైరూప్య చిత్రాల సిరీస్ లో ఎన్నో చిత్రాలు వేసిన రాంబాబు చిత్రాలు కంప్యూటర్ అసోసియేట్స్ అధినేత లోకేష్ జిందాల్ లాంటి వ్యక్తులతో బాటు మరెందరో సేకరణలో వున్నాయి .అటు చిత్రకళ ఇటు సినీ రంగంలోనూ తనదైన శైలిలో ముందుకు సాగుతూ నేడు మరలా హైదరాబాద్ ఐకన్ అర్ట్ గాలరీలోCHILD HOOD VIGNETTES పేరుతో  ప్రముఖ చలన చిత్ర కధకుడు, డైరెక్టర్ మరియు చిత్రకారుడు అయిన  శ్రీ శివశక్తి దత్త గారి చేతులమీదుగా ఈ నెల 13 నుండి ప్రారంభం కాబోతున్న మరో ప్రదర్శనలో మనం కోల్పోయిన మన బాల్యాన్ని మన పిల్లలు పోగొట్టుకుంటున్న ఆనందమయ జీవితాన్ని తనివి తీరా చూసి ఆనందిద్దాం రండి.

-వెంటపల్లి సత్యనారాయణ (9491378313)

6 thoughts on “బాల్యస్మృతులతో రంగుల చిత్రాలు

  1. సత్యనారాయణ గారూ..!!తనచిత్రాలతో రాజారాంబాబుగారు, అచిత్రాల ఆర్టికల్ తో మీరు, మరొక్కసారి మరిచిపోతున్న బాల్యపు స్మృతుల్ని మా స్మృతిపథంలోకి తెచ్చి మాకు ఆనందాన్ని పంచిన మీకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link