ఘనంగా తెలుగు భాషా మహోత్సవాలు

(తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించిన చిత్రలేఖన ప్రదర్శన)

సీ.ఎం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో భాషా ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి. విజయబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార భాషా సంఘం, భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న భాషా వికాస వారోత్సవాలు మంగళవారం ముగిసాయి. ఈ సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు సాహితీ వేత్తలకు పురస్కార కార్యక్రమాలు, తెలుగు వెలుగు అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం, కథల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. విజయబాబు మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి స్ఫూర్తితో వ్యవహారిక భాషా ఉద్యమం ఊపిరి పోసుకుందని తెలిపారు. గురజాడ, కందుకూరి లాంటి సాహితీవేత్తలు దానిని పరిపుష్టం చేసినట్లు చెప్పారు. భాషను బతికించుకోవడం కోసం భాషా వేత్తలు నడుం బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమ్మభాషకు మించిన కమ్మదనం మరొకటి లేదన్నారు. కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహించిన భాషా ఉత్సవాలు వెనక సమష్టి కృషి ఉం దన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ పైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, అధికా రభాషా సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు. తెలుగు భాషలో విశిష్ట కృషి చేసిన వంశీ రామరాజు, వెలమల సిమ్మన్నకు జీవిత సాఫల్య పురస్కారాలు, తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన 40 మందికి భాషా సేవా పురస్కారాలు, భాషా రత్న పురస్కారాలు ప్రదానం చేశారు. శోభాయాత్రను కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగింది. వేదిక మీద కవి పండితులు నిర్వహించిన భువన విజయం, చిన్నారుల కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి.

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిజ్ఞాస ఇంటర్ఫేస్ మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో గిడుగు… తెలుగు వెలుగు అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలతో పాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రదర్మనను తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఈ రోజు(29-823) సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి. విజయ్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారుల చిత్రకళా నైపుణ్యాన్ని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కళాసంసృతిని పెంపొందించే బాధ్యతను స్పూర్తిదాయకంగా నిర్వర్తిస్తున్న ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఛాయాచిత్ర ప్రదర్శన ను ఆసక్తిగా తిలకించి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిత్రించిన ఛాయాచిత్రకారుల ప్రతిభను అభినంచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్‘ టీం సభ్యులందలరికీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రసంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ కార్యక్రమాన్ని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, ఈవెంట్ మేనేజర్ స్ఫూర్తి శ్రీనివాస్, కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి, కోఆర్డినేటర్లు ఎస్.పి.మల్లిక్, కళాసాగర్ పర్యవేక్షించగా వర్కింగ్ కమిటీ మెంబెర్స్ శ్రావణ్ కుమార్, సంధ్య, స్వాతి పూర్ణిమ, సుధారాణి, మేడా రజని, శ్రీలక్ష్మీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Forum for Artist’s team with collector DilliRao, P. VijayaBabu and Kommineni Srinivasarao

1 thought on “ఘనంగా తెలుగు భాషా మహోత్సవాలు

  1. wonder event…wonderful article…this kind of events and articles will help to get inspiration to promote Telegu language and Telegu culture. thank you 64kalalu.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap