గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిజ్ఞాస ఫౌండేషన్ మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ఈరోజు(26-8-23) విజయవాడ, మొగల్రాజపురం సిద్ధార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కాంటెస్ట్ లో మన విజయవాడ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన పలు విద్యా సంస్థల నుంచి 450 విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.
మొత్తం నాలుగు విభాగాలుగా విభజించి నిర్వహించిన ఈ కాంటెస్ట్ లో సబ్ జూనియర్స్
5,6,7 తరగతుల వారు (తెలుగు పండుగలు), జూనియర్స్,
8,9,10 తరగతుల వారు (తెలుగు తల్లి కి వందనం),
సీనియర్స్ఇంటర్మీడియట్ వారు (తెలుగు సాంప్రదాయాలు)
సూపర్ సీనియర్స్ డిగ్రీ వారు (తెలుగు వెలుగు-మన గిడుగు) అనే అంశాలపై చక్కటి చిత్రాలను చిత్రించి గిడుగు రామమూర్తిగారికి ఘనమైన నివాళి అర్పించారు.
ఈ కాంటెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేయనున్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుగారి చేతుల మీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ గెలుపొందిన విద్యార్థులకు ప్రసంశా పత్రాలు జ్ఞాపికలు అందజేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, కోకన్వీనర్ గిరిధర్ అరసవల్లి, ఈవెంట్ మేనేజర్ స్ఫూర్తి శ్రీనివాస్, కోఆర్డినేటర్ అర్కాల రమేష్, వర్కింగ్ కమిటీ మెంబెర్స్ స్వాతి పూర్ణిమ, సుధా, శ్రావణ్ కుమార్, ప్రియాంకలు పర్యవేక్షించారు.