భారతదేశం ఎన్నో వేదాలకు.. సనాతన ధర్మానికి పుట్టినిల్లు… గత చరిత్రను తీసి చూస్తే… ఎన్నో పురాణ గాధలు… ఇతిహాసాలు గురించి తెలుసుకోవచ్చు. వాటి నుండి మన భారతదేశం ఎన్నో.. సంస్కృతులు… సాంప్రదాయాలు నెలకొన్నవి… వీటిని అన్నిటిని ఇప్పుడు ఉన్న విద్యార్థులకు, యువతకు తెలియజేయడానికి… మన హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశలో క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కాట్రేనికోన 8 వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ‘వందే వేద భారతం’ అనే అంశంతో అన్ని వయస్సుల వారికి చిత్రకళా పోటీలను ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా నిర్వహిస్తున్నారు. పోటీలో విజేతలకు అక్టోబర్ 8, 2023 న బహుమతులు అందజేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజి ఆకొండి తెలిపారు. దీనికి సంబందించిన గోడ పత్రికను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు ఆకొండి పవన్, అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మను విహార్ లు ఆవిష్కరణ చేశారు. ఈ చిత్రకళా పోటీ సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమలాపురం వారి సహకారంతో నిర్వహిస్తునట్టు సంస్థ ఆధ్యక్షులు అంజి ఆకొండి తెలియజేశారు.
చిత్రలేఖనం మీద ఆసక్తి ఉన్న అన్ని వయస్సులవారు ఈ చిత్రకళా పోటీలలో పాల్గొనవచ్చు.
Very good event.
Satya, Hyd.