రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక

రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక

July 1, 2023

ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, ఐరోపా విదేశీ ప్రాంతాలలో స్థిరపడిన భారతీయ కథకుల రచనలని గుర్తిస్తూ గత ఏడాది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వెలువరించిన “డయాస్పోరా తెలుగు కథానిక-16 వ సంకలనం” ప్రపంచవ్యాప్తంగా పాఠకుల, సాహితీవేత్తల, విశ్లేషకుల ఆదరణ పొందిన విషయం విదితమే.ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం…

‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

‘తానా’ కావ్య పోటీల్లో ‘లక్ష’ గెలుచుకున్న బులుసు

June 30, 2023

సిరివెన్నెల స్మృతిలో తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన లక్ష రూపాయల బహుమతితో కూడిన కావ్య పోటీలలో 91 మంది రచయితలు పాల్గొనడం విశేషం. లక్ష రూపాయల బహుమతి విజేత బులుసు వెంకటేశ్వర్లుకు, తానా ఈ పుస్తకంలో ప్రచురించడానికి అర్హత పొందిన 50 మంది కావ్య రచయితల వివరాలు ప్రకటించారు. ప్రముఖ సినీ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి…

మూగబోయిన తెలంగానం – సాయిచంద్

మూగబోయిన తెలంగానం – సాయిచంద్

June 30, 2023

ప్రజాయుద్ధ సంగీతం, నెత్తుటి చాళ్ళలో విత్తనమై మొలకెత్తిన పాటల వనం, అట్టడుగు ప్రజల కోసం గళమెత్తిన ప్రజా గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వి. సాయిచంద్ జూన్ 29 న గుండెపోటుతో మరణించడం తెలంగాణ కళా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రజా నాయకుడు, పాట కవి ఇలా అకాల మృత్యువును పొందడం…

‘గీతా ప్రెస్’కు గాంధీ పురస్కారం

‘గీతా ప్రెస్’కు గాంధీ పురస్కారం

June 27, 2023

ఎంతో ప్రఖ్యాతి కలిగిన గోరఖ్ పూర్ ‘గీతా ప్రెస్’కు ప్రతిష్ఠాత్మకమైన ‘గాంధీ శాంతి పురస్కారం’ ప్రదానం కానుంది. ఈ దిశగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్న విషయం తెలిసిందే. గీతా ప్రెస్ స్థాపించి ఈ ఏటికి వందేళ్ళు పూర్తయ్యాయి. ఇటువంటి విశిష్ట సమయంలో…

శంకర నారాయణ డిక్షనరి కథ

శంకర నారాయణ డిక్షనరి కథ

June 13, 2023

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.ముందు వ్యాపారం చేయడానికి… తరువాత అధికారం చెలాయించడానికి….వాడి భాష మనకి రాదు…వాడు “గాడ్ ఈజ్ గుడ్” అనేవాడు. మనకి అది “గాడిదగుడ్డు” గా అర్థమైంది.మనం “రాజమహేంద్రి” అన్నాం… వాడికి “రాజమండ్రి”లా వినిపించింది.మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు… వాడి భాష మనకి బోధపడేది కాదు.వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ…

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు శత వర్థంతి

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు శత వర్థంతి

June 10, 2023

తెలుగుజాతి వైతాళికుడు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారి శత వర్థంతి జీవితంలో అనుక్షణం పరిశోధనే ప్రాణంగా, భాషాచరిత్ర, సాహిత్యాలను మధించి, సజాతీయ విజాతీయ భాషా సాహిత్యాల లోతులను చూసి, సాదృశ్య వైదృశ్యాలను సమ్యక్ దృష్టితో తెలుగుజాతికి అందించిన, తెలుగువారిని ఆధునికయుగం వైపు నడిపించిన మహనీయుడు, తెలుగువారు విస్మరించిన వైతాళికుడు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారు (1875-1923). చరిత్ర, శాసన పరిశోధనను…

సోషలిజం నేటికి సఫలం కాలేదు – అరసవిల్లి

సోషలిజం నేటికి సఫలం కాలేదు – అరసవిల్లి

June 6, 2023

“నిద్ర నా ప్రియమైన శత్రువు కాదునిద్రలోనే కవి ఆత్మహత్యనిద్రలోనే ఎదురు కాల్పులునిద్రలోనే ఆదివాసి ధిక్కారంనిద్రపోయేదెపుడని “ నిద్ర చాలక కవితలో అంటారు… అరసవల్లి కృష్ణ గారు. నిరంతర జాగూరుకుడైన కవి అతడు. తనదైన సంతకాన్ని తెలుగు కవిత్వపుటల్లో చెక్కిన కవిగా… రాజకీయాలకు కూడా కవిత్వ పరిమళాన్ని అద్దే ‘తడి ఆరని’ వాక్యమతడిది.బాల్యంలోనే ఉత్తరాంధ్ర పల్లె నుండి నగరానికి వలస…

కథలపోటీ ‘సోమేపల్లి పురస్కార’ విజేతలు

కథలపోటీ ‘సోమేపల్లి పురస్కార’ విజేతలు

June 6, 2023

14వ జాతీయస్థాయి చిన్న కథలపోటీలలో ‘సోమేపల్లి పురస్కార’ విజేతలు ఇటీవల ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న కథలకు సోమేపల్లి సాహితీ పురస్కారాల పోటీలలో ‘అకుపచ్చని పొద్దు’ కథకుగాను బి. కళాగోపాల్ (నిజామాబాద్) ప్రథమస్థాయి సోమేపల్లి పురస్కారం లభించింది. ‘విత్తు’ కథా రచయిత బి.వి. రమణమూర్తి (మధురవాడ)కు ద్వితీయ, ‘వైకుంఠపాళి’ కథా రచయిత మల్లారెడ్డి మురళీమోహన్ (విశాఖపట్నం) లకు తృతీయ…

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

June 1, 2023

(జూన్ 1న శీలా వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…) బహుముఖ ప్రజ్ఞాశాలురు అరుదుగా ఉంటారు. అటువంటివారిలో శీలా వీర్రాజు ఒకరు. ఆయన చిత్రకళ, సాహిత్యం రంగాలలో అద్భుతంగా రాణించారు. ఓ పత్రికలో సబ్- ఎడిటర్ కమ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1963 లో రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకుడుగా చేరారు….

తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

May 31, 2023

కేతు విశ్వనాథ రెడ్డిగారు (22-05-23) భౌతికంగా మన నుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్లిపోయాడు. ఎన్నో చిగురుటాకులకు మార్గదర్శకంగా నిలిచినవాడు, ఒక సంక్లిష్టమైన ప్రాంతీయతను సాహిత్యం చేసినవాడు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. కరువులు తాండవించే నేలల మీదుగా, కక్షల సుడిగాలులు చెలరేగే గ్రామాల వీధుల మీదుగా…