ఆగస్ట్ 15వ ‘జయహో భారత్’ ఆర్ట్ కాంటెస్ట్

(ఆగస్ట్ 15వ చిన్నారులకు జయహో భారత్.. Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్)

కళల్నీ… కళాసంసృతిని కాపాడుకోవటంతో పాటు నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త నిర్వహణలో… టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (TautMore Learning Pvt Ltd) వారి సమర్పణ లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2-4 గంటల వరకు జయహో భారత్… Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహించడుతుందని నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కన్వీనర్ సునీల్ కుమార్ అనుమకొండ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రతినిధి పిన్నమనేని మురళీకృష్ణ, టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో పద్మలత లతో పాటు కో-కన్వీనర్ గిరిధర్ అరసవల్లి, ఈవెంట్ మేనేజర్ స్ఫూర్తి శ్రీనివాస్, కో-ఆర్డినేటర్లు కళాసాగర్, మల్లిక్ లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొననున్నారు.

1 నుండి 9 వ తరగతి విద్యార్ధులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విజయవాడ నగరంలో జయహో భారత్ ఆర్ట్ కాంటెస్ట్.

గ్రూప్స్:
*సబ్ జూనియర్స్ (1, 2, 3 తరగతులు)
అంశం: జాతీయ పతాకానికి శాల్యూట్

*జూనియర్స్ :(4, 5, 6 తరగతులు)
అంశం: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

*సీనియర్స్: (7, 8, 9 తరగతులు)
అంశం: నేను కలలుగన్న నా దేశం

వేదిక: బాలోత్సవ్ భవన్, రెండవ అంతస్తు, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం,
రాఘవయ్య పార్క్ ఎదురుగా, మహాత్మాగాంధీ రోడ్, విజయవాడ

*మధ్యాహ్నం 2 – 4 గంటలకు ఆర్ట్ కాంటెస్ట్

*4-5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు

*5-6 గంటలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం

విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొనుటకు ఆఖరి తేదీ 14 ఆగష్టు @ forumforartistsvja@gmail.com

నియమ నిబంధనలు:____________________________________________

1). 1 నుండి 9 తరగతి చదివే విద్యార్థులు పాల్గొన్నవచ్చు
2). విద్యార్థులు వారికి నచ్చిన ఏ మీడియంలో నైనా చిత్రాలు గీయవచ్చు
3). 1/4 సైజ్ (11″x14″) డ్రాయింగ్ షీట్ ఇవ్వబడుతుంది
4) ప్యాడ్, కలర్స్, ఇతర అవసరమైన వస్తువులు మీరే తెచ్చుకోవాలి.
5). విద్యార్థులు డ్రాయింగ్ షీట్ వెనుక తమ‌ పేరు,తరగతి, స్కూల్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది
6). మీకిచ్చిన అంశం మీద మాత్రమే చిత్రాలు గీయవలసి ఉంటుంది
7). మీరు బొమ్మ గీసిన విధానానికి,రంగుల సమ్మేళనానికి మార్కులు ఇవ్వబడతాయి.
8). సెలక్షన్ కమిటీ సభ్యులదే తుది నిర్ణయం.
9). కాంటెస్ట్ లో గీసిన చిత్రాలు ఇవ్వబడవు
10). ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేయబడుతుంది.
11). ఈ మెయిల్ forumforartistsvja@gmail.com ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే అర్హులు.
12). కాంటెస్ట్ జరిగే ప్రదేశంలోకి ఇతరులకు అనుమతి ఉండదు.
13). అదే రోజున జరిగే బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మాత్రమే బహుమతులు ఇవ్వబడతాయి.

2 thoughts on “ఆగస్ట్ 15వ ‘జయహో భారత్’ ఆర్ట్ కాంటెస్ట్

  1. కళల్నీ…కళాసంసృతిని కాపాడుకోవటంతో పాటు నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన సామాజిక బాధ్యత కళాకారులుగా మనపై ఎంతైనా ఉంది.

    # మురవాలి మువ్వన్నెల జెండా…ప్రతి కళాకారుడి మది నిండా #
    జయహో భారత్… Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్

    కళాసాగర్ గారూ చాలా చక్కటి కవరేజ్ ఇచ్చారు.థ్యాంక్యూ.

    ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం
    విజయవాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap