యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

December 27, 2023

విజయవాడలో యుద్ధోన్మాదులపై గళమెత్తిన గాయకులు, కలమెత్తిన కవులు యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయని, అందుకే యుద్ధం కోరే దేశాలపై మనం అప్రమత్తంగా వుండాలని నోబెల్ పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ మెంబర్, ప్రపంచశాంతి దూత డా. బాలకృష్ణ కుర్వే అన్నారు. ది. 27-12-23 న, విజయవాడ, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవభారత్ నిర్మాణ సంఘం-గాంధీ దేశం…

దేశం గర్వించే గొప్ప దర్శకుడు – నర్సింగ్ రావు

దేశం గర్వించే గొప్ప దర్శకుడు – నర్సింగ్ రావు

ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు, స్వరకర్త, పెయింటర్‌, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి బి. నరసింగరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ! తెలంగాణాలోని ప్రజ్ఞాపూర్‌లో 1946 డిసెంబర్ 26 న జన్మించిన నర్సింగ్ రావు అణచివేతకు గురైన ప్రజల పక్షాన నిలబడ్డారు. ఆంధ్ర ఆధిపత్యాన్ని ధిక్కరించి…

డి.వి. సుబ్బారావు విశ్వరూపం!

డి.వి. సుబ్బారావు విశ్వరూపం!

December 26, 2023

పుట్రేవు వారి పరివారం అదృష్టవంతులు. నిజంగా వారిని అభినందించాలి. హైదరాబాద్, రవీంద్రభారతి లో గురువారం(21-12-23) ప్రముఖ రంగస్థల నటులు కీర్తిశేషులు పుట్రేవు రాధాకృష్ణమూర్తి గారి 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయనకు అత్యంత ఇష్టమైన నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. పుట్రేవు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఈ వేడుకలో పాల్గొని కళాకారులను…

రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యాసంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో 2024, జనవరి 5,6,7 తేదీలలో నిర్వహించబడుతున్నయి. ఈ మహాసభలకు ఆరవ తేదీ సాయంకాలం జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు హాజరవుతున్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ కరపత్రికను…

ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే

ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే

December 25, 2023

జ్ఞానోదయం నాడు ఈ పుస్తకాన్ని చూశాను. జ్ఞానము ఫటాపంచలయింది. సంవత్సరాలు పూర్తి మీద పూర్తి సంపూర్తి అయిపోతూనే ఉన్నాయి. ఒక్క బొమ్మ పూర్తి కాలేదు, అసలు మొదలు పెడితే కదా, పూర్తవడానికి! అసలే జీవితము బరువైంది, ఆపై ఈ పుస్తకం వచ్చి సిందుబాదు భుజాలమీద కూచున్నట్టుగా వచ్చి కూర్చుంది. ఎంతకూ దిగనంటుంది. అది దిగనంటుందా? దించుకోవడానికి నాకే ఇష్టం…

శ్రవ్య నాటకాల వేదిక ఆకాశవాణి

శ్రవ్య నాటకాల వేదిక ఆకాశవాణి

December 25, 2023

పండితుల నుంచి పామరుల వరకు ఆబాల గోపాలన్ని అలరించే అందరి వాణి ఆకాశవాణి, దానికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ఒకటి “శ్రవ్య నాటకం” నాటకంలోని అన్ని అంశాలు ప్రదర్శన యోగ్యంగా ఉండవు, అలాంటి వాటిని ప్రదర్శనకు అనుకూలం చేయడంలోనే దర్శకుడి ప్రతిభ వుంటుంది. శబ్ద నాటకానికి సంభాషణలే శిఖరాయమానంగా ఉంటాయి, ఒక చూపులో ఒక కదలికలో, ఒక అంగ…

నిరంతర రచనాశీలి – డా. జి.వి.

నిరంతర రచనాశీలి – డా. జి.వి.

December 23, 2023

డా. జి.వి. పూర్ణచంద్ గారిది వైద్యం లోనే కాకుండా సాహిత్యపరంగా, భాషాపరంగా అందె వేసిన చెయ్యి, తెలుగు భాషా ప్రేమికునిగా ‘తెలుగేప్రాచీనం’ రచించారు. హిందీ, ఇంగ్లీషులలో కూడా ఈ గ్రంథం అనువాదం ఐయింది. వీరు, వైద్యానికీ సాహిత్యానికీ సంబంధించి అనేక వందల గ్రంథాలు రచించారు. ఒకప్పుడు మినీ కవితా ఉద్యమాన్ని రావి రంగారావుతో కలిసి భుజాల కెత్తుకున్నారు. అమలిన…

ఆంధ్రుల శిల్పకళకు పుట్టిల్లు “దుర్గి”

ఆంధ్రుల శిల్పకళకు పుట్టిల్లు “దుర్గి”

December 15, 2023

కళ్లను కట్టిపడేసే చాతుర్యం, సృష్టికి ప్రతిసృష్టి అనిపించే జీవకళ –మొత్తంగా ఆంధ్రుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక…‘దుర్గి శిల్పాలు’. కంప్యూటర్ యుగంలో కూడా సంప్రదాయ కళను నమ్ముకున్న గ్రామం…గుంటూరు జిల్లాలోని దుర్గి. దుర్గి శిల్పాలు ఇటీవలే కేంద్ర ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు (జీఐ)ను సాధించాయి. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన సందర్భంగా… అతిథులకు సాదరంగా స్వాగతం పలికాయి దుర్గి శిల్పాలు. కృష్ణా,…

మహాను’బాపు’డు

మహాను’బాపు’డు

December 15, 2023

(బాపుగారి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మన మనసులో ఆ రచనలోని రూపాలు మెదలుతాయి. ఆ మనోహర రూపాల సౌందర్యాన్ని నయనానందకరంగా చూపే కుంచె పేరే బాపు. బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి…. సిగ్గుపడతాయి… నవ్విస్తాయి… ఎక్కిరిస్తాయి కూడా. బాపు ముఖచిత్రం వేస్తే ఆ రచనకు… ఆ పుస్తకానికి…

‘చిత్రలేఖనం’తో సృజనకు పునాది

‘చిత్రలేఖనం’తో సృజనకు పునాది

December 12, 2023

రాజమహేంద్రిలో చిత్రలేఖనం పోటీలకు అపూర్వ స్పందనవివిధ పాఠశాలల నుంచి తరలొచ్చిన వందలాది విద్యార్థులు దామెర్ల రామారావు, సపాద శత జయంతి (125వ) ని పురస్కరించుకుని గోదావరి బాలోత్సవం, మారేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ, గోదావరి జిల్లాల కార్టూనిస్ట్స్ సంఘం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్,విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, దానవాయిపేట మున్సిపల్ హైస్కూలులో చిత్రలేఖనం పోటీలు ఆదివారం (10-12-23)న జరిగాయి….