సుదీర్ఘమైన కళాయాత్రలో నూతలపాటి

సుదీర్ఘమైన కళాయాత్రలో నూతలపాటి

June 19, 2022

తెలుగు నాటక ప్రేమికుల కందరికీఎంతో ఇష్టమైన పేరది!తెలుగు నాటక నటీనటులందరూఎంతో ప్రేమించే పేరది!తెలుగు నాటక నిర్వాహకులందరికీతలలో నాలికలా నిలిచే పేరది!తెలుగు నేలలో జరిగే ప్రతీ కళాపరిషత్తులోతప్పక విన్పించే పేరది!తెలుగు నాట గత అరవై సంవత్సరాలుగానాటకంతో కలిసి సాగుతున్న పేరది!తెలుగు నాటక వర్తమాన చరిత్రలోఅసంఖ్యాకమైన సత్కారాలందుకొన్న పేరది!ఆ పేరే సాంబయ్య…!!నూతలపాటి సాంబయ్య!!! పేరులో ఏముంది? అంటారు కొందరు!కానీ.. ఆ పేరులోనే…

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

June 13, 2022

12-06-2022 తేది శనివారం, గుంటూరు, అన్నమయ్య కళావేదిక బృందావన్ గార్డెన్స నందు ‘కవిరాజశేఖర’, ‘కవితాసుధాకర’ కీ.శే. శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తి ‘కేంద్రసాహిత్య అకాడమీ’ పురస్కార గ్రహీత గారికి నివాళిగా నవక్రాంతి సాంస్కృతిక సమితి(హైదరాబాద్) వారిచే రక్షాబంధం చరిత్రాత్మక పద్యనాటకం ప్రదర్శన జరిగినది. ప్రదర్శనకు ముందు కృష్ణమూర్తిగారు పల్నాడు గామాలపాడులో పోస్టుమాస్టర్ గా పనిచేస్తూ రచించిన ‘పురుషోత్తముడు’ మహాకావ్యానికి కేంద్రసాహిత్య…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

June 10, 2022

సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకం దార్ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్లీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృ హంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ…

‘డ్రామా’ అనే పదం ఎక్కడిది?

‘డ్రామా’ అనే పదం ఎక్కడిది?

“డ్రామా” అనే పదం గ్రీకు దేశం నుండి వచ్చింది. డ్రామా అంటే జరిగిన పని లేదా చేసిన విషయం. మామూలు మాటల్లో చెప్పాలంటే “వేసిన నాటకం”. అలాగే, థియేటర్ అనేది కూడా గ్రీకు పదమే.ఇక, ఆడియన్స్ అనేది లాటిన్ భాషా పదం. ఇలా, నాటకానికి సంబంధించి మనమందరం తెలుగులో సులువుగా వాడుతున్న ఈ పదాలు అన్నీ, గ్రీకు,లాటిన్ భాషా…

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

June 5, 2022

శ్రీ గిడుగు సూర్యనారాయణ శ్రీమతి సత్యవతి దంపతులకు 1927 లో, పశ్చిమ గోదావరి జిల్లా “ఏలూరు”లో మూడవ సంతానంగా జన్మించిన ఆయనకు బాలసాలలో పెట్టిన నామకరణం “గిడుగు సీతారామ చంద్రమూర్తి” ఆయన 18వ యేటనే మిలటరీలో పనిచేసారు. ఆ “క్రమశిక్షణే”వారి జీవితంలోను, నాటకరంగంలోను ఉపయోగపడింది. G.S.R. మూర్తిగారు విజయవాడ, కేదారేశ్వరపేట” ఆంధ్ర సిమెంట్ కంపెనీ”లో దాదాపు 30 సం..లు…

తెలుగుజాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

తెలుగుజాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

May 27, 2022

(ఎన్.టి. రామారావు శత జయంతి సందర్భంగా) ఈరోజు, అంటే మే నెల 28 న తెలుగుజాతి యుగపురుషుడు… తెలుగు వెండితెరకు తారకరాముడైన నందమూరి వంశోద్ధారకుని 99 వ జయంతి. నందమూరి తారక రామారావు జీవన ప్రస్థానం సంచలనమయం. ఆ ప్రస్థానానికి రెండు పార్స్వాలు. మొదటిది నటజీవితం కాగా రెండవది రాజకీయ ప్రస్థానం. రామారావు సినీరంగ ప్రవేశమే ఓ సంచలనం….

‘రావణ మరణం తర్వాత’ నాటకం

‘రావణ మరణం తర్వాత’ నాటకం

May 25, 2022

ప్రచారంలో లేని కధకు రచయిత మిస్రో నాటకీకరణ… హైదరాబాద్, రవీంద్రభారతిలో 24-05-22 న టిక్కెట్ పై నాటక ప్రదర్శన అనే ఉద్యమంగా నడుస్తున్న రస రంజని నాటక సంస్థ నిర్వహణలో బహురూప నట సమాఖ్య విశాఖ వారిచే ప్రదర్శితమైన ఈ నాటకం ప్రేక్షకులకు కొత్త కథను అందించారు. సోదరుడు విభీషణుడు శత్రు పక్షం రాముని కూటమిలో చేరి అన్న…

వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానం

వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాల ప్రధానం

May 17, 2022

గుంటూరు బృందావన్ గార్డెన్ లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళా వేదికగా సాంస్కృతిక బందు సారిపల్లి కొండలరావు సారధ్యంలో యువకళావాహిని ఆధ్వర్యంలో స్వర్గీయ వై.కే. నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం(15-05-22) సాయంత్రం వైకె నాగేశ్వరరావు స్మారక పురస్కార ప్రధానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ముఖ్య అతిధిగా…

తెలంగాణలో నాటకరంగ సాహిత్యం- శ్రీనివాస్

తెలంగాణలో నాటకరంగ సాహిత్యం- శ్రీనివాస్

April 22, 2022

“తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ” మరియు “తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)” సంయుక్తంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల “తెలంగాణ యువ నాటకోత్సవం-6” 21వ తేది సాయంత్రం రవీంద్రభారతిలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ గారు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, సినీ దర్శకులు దశరథ్ గారు,…

వేమన నాటకం – కందుకూరి నృత్యరూపకం

వేమన నాటకం – కందుకూరి నృత్యరూపకం

April 15, 2022

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళా పీఠం, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఏప్రిల్ 15 వ తేదీన వేమన నాటకం మరియు 16 తేదీన సంస్కరణోద్యమ ఖడ్గదారి కందుకూరి – సంగీత నృత్యరూపకం ప్రదర్శించబడును. సమయం సాయత్రం గంట.6.30 ని.లకు… అందరూ ఆహ్వానితులే… వినురవేమ – నాటకం 400 సంవత్సరాల క్రితం తెలుగునాట…