రామ్ అవుర్ శ్యామ్ పదనిసకు నరసరాజు సరిగమ

రామ్ అవుర్ శ్యామ్ పదనిసకు నరసరాజు సరిగమ

July 16, 2022

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినిమా తీయాలని మద్రాసు వచ్చి కొందరు కారంచేడు వాస్తవ్యులతో భాగస్వామ్యం కలుపుకొని తొలి ప్రయత్నంగా గుత్తా రామినీడు దర్శకత్వంలో ‘అనురాగం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు మెయిన్ పార్టనర్ భాస్కరరావు. రామానాయుడు ఓత్రనిర్మాణానికి సంబంధించిన ప్రతి చిన్న పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతూ సినిమానిర్మాణపు మెళకువలు క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ‘అనురాగం ‘సినిమా…

తెలుగు వెండితెరకు తొలి టాకీ కృష్ణుడు… సియ్యస్సార్

తెలుగు వెండితెరకు తొలి టాకీ కృష్ణుడు… సియ్యస్సార్

July 14, 2022

టాకీలు రాకముందు అంటే 1932 కు పూర్వం ప్రజలకు వినోద సాధనం నాటకాలే. టాకీలు వచ్చిన కొత్తల్లో నాటకరంగం నుంచి సినిమారంగంలోకి ఎంతోమంది గొప్పగొప్ప రంగస్థలనటులు వచ్చారు. వారిలో కొందరు ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించారు. హరిశ్చంద్రుడు అంటే డి.వి.సుబ్బారావు, సత్యభామ అంటే స్థానం నరసింహారావు, దుర్యోధనుడు అంటే మాధవపెద్ది వెంకట్రామయ్య, యముడు/కంసుడు అంటే వేమూరు గగ్గయ్య, నారదుడు…

40 ఏళ్ల క్రితమే యువతరాన్ని కదిలించిన ‘చిత్రం ‘

40 ఏళ్ల క్రితమే యువతరాన్ని కదిలించిన ‘చిత్రం ‘

July 9, 2022

యువతను ఉర్రూతలూగించిన రెడ్ స్టార్ కామ్రేడ్ మాదాల రంగారావు నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయ్యాయి. విప్లవ కథానాయకుడు, ‘రెడ్ స్టార్’ కామ్రేడ్ మాదాల రంగారావు స్వయంగా కథను సమకూర్చి, నటించడంతో పాటు స్వీయ సారధ్యంలో నిర్మించిన చిత్రం ‘యువతరం కదిలింది’ దర్శకుడు ధవళ సత్యం. 1980 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం…

సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !

సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !

July 5, 2022

సాంస్కృతిక పాత్రికేయ శిఖరం కూలిపోయింది. కళారంగం మూగ వోయింది. నాట్యరంగంలో ఎంతో మందిని సద్విమర్శ చేసి ప్రోత్సహించిన కలం ఇక ఆగిపోయింది. సీనియర్ పాత్రికేయ మహా దిగ్గజం గురుతుల్యులు శ్రీ గుడిపూడి శ్రీహరిగారు కనుమూసారు. 60 ఏళ్లకు పైగా పాత్రికేయ రంగంలో మకుటాయమానంగా వెలిగిన శ్రీహరి గారు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు. నేను అమెరికా లో ఉండటం…

విశ్వ నటచక్రవర్తి రంగారావు

విశ్వ నటచక్రవర్తి రంగారావు

July 4, 2022

సినిమాలలో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్.వి. రంగారావు చలనచిత్రరంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. పాతాళభైరవి సినిమా విడుదలయ్యేదాకా రంగారావు సినిమారంగంలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మోజుతో చేతికందిన ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. తొలిరోజుల్లో రంగారావు నటజీవితం వడ్డించిన విస్తరి కాదు. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు…

దర్శకత్వకళాపద్మం… కమలాకర కామేశ్వరం

దర్శకత్వకళాపద్మం… కమలాకర కామేశ్వరం

June 29, 2022

వేదాధారమైన మన రామాయణ, భారత, భాగవత పురాణ గ్రంధాలు ప్రముఖంగా ధర్మప్రబోధకాలు. ఎంతో తపోనిష్టతో రూపొందిన ఈ పురాణ కథలకు రూపకల్పన చేసి సినిమా మాధ్యమంలో ప్రజలకు చేరువ చేయాలని ఎందరో మహనీయులు వందేళ్ళ క్రితమే ప్రయత్నం ప్రారంభించారు. చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 1912లోనే “రాజా హరిచంద్ర” పురాణకథనే చిత్రాంశoగా ఎన్నుకున్నారు. ఫాల్కే నిర్మించిన తొలి…

70 వ పడిలో అడుగిడిన దేవదాసు

70 వ పడిలో అడుగిడిన దేవదాసు

June 27, 2022

దేవదాసు నవలను తెలుగులోకి చక్రపాణి అనువదించి ఉండకపోతే…. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులని అలరించి వుండేదే కాదు. విశ్వజనీనత మూర్తీభవించే ఆవేదన నింపిన ఒక సజీవ పాత్ర దేవదాసు. అక్కినేని నటజీవితాన్ని మలుపు తిప్పిన అపురూప మహత్తర పాత్ర…. దేవదాసు. 26 జూన్ 1953న విడుదలై న దేవదాసు సినిమా 400 రోజులు పైగా ఆడి వజ్రోత్సవం జరుపుకుంది….

భావితరాల స్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

భావితరాల స్వర మాంత్రికుడు ‘యమ్మెస్వి’

June 24, 2022

సంగీతమనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. అది ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి యెలాంటి భావాలకైనా అద్దంపట్టేది సంగీతమే. వేదాలు కూడా సంగీత స్వరాలే. రాళ్ళనుకూడా కరిగించే గాంధర్వం సంగీతం. సంగీతం సాధించలేనిది యేదీ లేదు… యెందుకంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక. “రాగస్వరశ్చ తాళశ్చత్రిభి: సంగీత…

జానపద సిరి రాఘవయ్య చౌదరి

జానపద సిరి రాఘవయ్య చౌదరి

June 23, 2022

(కొసరాజు జయంతి సందర్భంగా…) కొసరాజు రాఘవయ్య చౌదరి స్వస్థలం గుంటూరు జల్లా అప్పికట్ల. పుట్టింది 23 జూన్ 1905 న. రాఘవయ్య చౌదరి కి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటప్పయ్య. చిన్నతనంలో జబ్బుచేయడంతో, తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి మ్రొక్కుకొని వెంకటప్పయ్య పేరును రాఘవయ్యగా మార్చారు. అప్పట్లో అప్పికట్లలో నాలుగవ తరగతివరకే వుండేది. రాఘవయ్య నాలుగవ తరగతి పూర్తిచేసి ‘బాలరామాయణం’, ‘ఆంధ్రనామ…

పడిలేచిన కడలి తరంగం యల్.వి. ప్రసాద్

పడిలేచిన కడలి తరంగం యల్.వి. ప్రసాద్

June 22, 2022

దశాబ్దాల భారతీయ సినిమా చరిత్రకు అందమైన గుర్తుగా నిలిచిన మహనీయుడు ఎల్.వి. ప్రసాద్. ప్రసాద్ పూర్తి పేరు అక్కినేని లక్ష్మి వరప్రసాద్. సినిమారంగంలో ఆర్జించిన సంపదను సినీరంగ అభివృద్ధికే వెచ్చించి, సినిమా పరిశ్రమను విస్తరింపజేసిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఎల్.వి. ప్రసాద్ పేరు ముఖ్యంగా చెప్పుకోవాలి. అందుకే ఆయన సినిమా ‘వరప్రసాది’గా కీర్తి పొందారు. ‘కృషి వుంటే మనిషి…