భరతజాతి యశోగీతి

భరతజాతి యశోగీతి

August 14, 2022

భరతజాతి యశోగీతి పాడవోయి సోదరావీనుల విందుగా నాద సుధా ఝరులు జాలువార వేదమాత నా ధరణి వేల సంస్కృతుల భరణియజ్ఞాలకు యాగాలకు ఆలవాలమైన ఆవనివాల్మీకి వ్యాసులు పోతన నన్నయ్యాదులసారస్వత పరిమళాల వారసత్వమును చాటుచు ఆత్మబోధనందించే గీతాచార్యుడు నాడేగౌతమ బుద్ధుని యానము శాంతి మార్గమును చాటేఅద్వైతం పంచే ఆదిశంకరులు నలుదిశలసనాతనమే సకల ధర్మ సంగమ సుక్షేత్రమని జాతిపిత గాంధీజీ నెహ్రూ…

“భారత్ హమారా”  బాలల చిత్రకళా ప్రదర్శన

“భారత్ హమారా” బాలల చిత్రకళా ప్రదర్శన

August 13, 2022

ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ కు సంస్కృతి పురస్కార ప్రదానం ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా హైదర్ గూడ గ్రామములో ఉన్న సంస్కృతి కళా కేంద్రంలో నేడు (13-08-2022) “భారత్ హమారా” అంతర్జాతీయ బాలల చిత్రకళా ప్రదర్శన ప్రారంభం మరియు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్…

వినీలాకాశంలో ధ్రువతార… శ్రీదేవి

వినీలాకాశంలో ధ్రువతార… శ్రీదేవి

August 13, 2022

ఆమె సినీ వినీలాకాశంలో ఓ ధ్రువతార. నటనతో భారతీయ సినీ ప్రపంచంలోనే తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన అరుదైన నటీమణి. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడచి బాలీవుడ్‌లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. ఆమే శ్రీదేవి. అందాల తారగా, అభినయంలో మేటిగా సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి తారాపధానికి ఎదిగిన తీరు ఆద్యతం ఆసక్తికరం….

జల వర్ణాల మాయాజాలం-శ్యామ్ చిత్రం

జల వర్ణాల మాయాజాలం-శ్యామ్ చిత్రం

August 13, 2022

అతని చిత్రాల్లో ప్రకృతి సోయగాలుంటాయి…పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి…జంతువులను అమ్మాయిల కంటే అందంగా చిత్రిస్తాడు.సాధారణంగా ఏ చిత్రకారుడైనా తన చిత్రాలను రేఖల అధారం చేసుకొని చిత్రీకరిస్తాడు.కాని శ్యామ్ చిత్రాలలో మనకు రేఖలు ఎక్కడా కనపడవు.తన కుంచెను రంగుల్లో ముంచి పేపర్ పై అద్దితే రంగుల జలపాతాన్ని తలపిస్తాయి.సప్తవర్ణ హరివిల్లుతో వీక్షకులను ఊహాలోకాల్లో విహరింపజేస్తాడు. ముప్పై రెండేళ్ళ శ్యామ్ కుమార్…

రాఖీ

రాఖీ

August 11, 2022

సోదరి కట్టే రక్షా బంధన్అన్నదమ్ముల సోదర ప్రేమకుఅక్క – చెల్లెళ్లు పలికేసాదర స్వాగతానికి ప్రతీక.ఈ రాఖీ ఓ మంగళ ‘కర’సూత్రంఆడపడుచుల రక్షణఅన్నదమ్ముల బాధ్యతరాఖీ సోదరీ సోదరుల ఆప్యాయతల కలబోతఇదే మన భారతీయతఅక్కచెల్లెళ్లు అన్నదమ్ముల అనుబంధంమేలి మానవ సంబంధాల సుగంధంఅన్న – నాన్నకు ప్రతిరూపంఅక్క – అమ్మకు పర్యాయంతోబుట్టువులు కడుపున పుట్టిన వారితో సమంఈ బంధాలను చాటేరాఖీ సదాచారాల సామాజిక…

మువ్వన్నెలపతాకం… రెపరెపల అమృతోత్సవాలు!!

మువ్వన్నెలపతాకం… రెపరెపల అమృతోత్సవాలు!!

August 11, 2022

దాదాపు 190 ఏళ్ల బ్రిటిష్ ముష్కరుల దుష్కర దాస్య శృంఖలాలు తెంచుకుని భారతావని స్వేచ్ఛావాయువు పీల్చి ఈ ఆగస్టు 15 వ తేదీకి 75 సంవత్సరాలవుతున్న చారిత్రక సందర్భమిది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఘనత వహించిన ఈ దేశంలో అంబానీ, ఆదానీ, ఇతర పారిశ్రామిక ముఠాకీ, ఈస్టిండియా కంపెనీని మించిన వ్యాపార కూటమికీ ఉన్నంత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు జనసామాన్యానికి…

జయదేవ స్వరమణి… రఘునాథ్ పాణిగ్రహి

జయదేవ స్వరమణి… రఘునాథ్ పాణిగ్రహి

August 10, 2022

( ఈరోజు పాణిగ్రహి జయంతి. ఈ గొప్ప సంగీత విద్వాంసుడు మరణించడానికి కేవలం మూడునెలల ముందు భువనేశ్వర్ లో వారి స్వగృహంలో కలిసి నేను జరిపిన ఇంటర్వ్యూలో పాణిగ్రహి వెల్లడించిన కొన్ని మధుర స్మృతుల సారాంశాన్ని మీకు అక్షర రూపంలో సమర్పిస్తున్నాను.) పద్మశ్రీ పండిట్ రఘునాథ్ పాణిగ్రహి పేరు తెలుగు సినీ ప్రేమికులకు 1956లో వచ్చిన ‘ఇలవేలుపు’ సినిమా…

వానచుక్క… కన్నీటి చుక్క… కలిస్తే జాలాది!

వానచుక్క… కన్నీటి చుక్క… కలిస్తే జాలాది!

August 9, 2022

(ఈరోజు జాలాది జయంతి – 9 ఆగస్టు 1932)‘‘అందరూ రాయగలిగేవి… ఏ కొందరో రాయగలిగేవి’’ ఇలా సినిమా పాటలు రెండు రకాలనుకుంటే – జాలాది పాటలు – రెండో రకంలోకి వస్తాయి! వెదికి చూడండి.. మచ్చుకి ఒక్క బరువైన మాట కనిపిస్తే ఒట్టు! జాలాది పాట వింటున్నప్పుడు నిఘంటువులు నిద్రపోతాయి. అన్వయాల కోసం ఆలోచించాల్సిన పని తప్పి, మెదళ్లు…

ఆ కొంటె కోణంగే… ‘మా’ రేలంగి

ఆ కొంటె కోణంగే… ‘మా’ రేలంగి

August 9, 2022

“నవ్వూ, ఏడుపూ కలిస్తే సినిమా. ఏడుపూ, నవ్వూ కలిస్తే జీవితం. బాగా డబ్బువుండి దర్జాగా బతకడం జీవితం కాదు. అలాగే ఏమీ లేకుండా ఎప్పుడూ బాధపడడం కూడా జీవితం కాదు. ఈ రెండూ పెనవేసుకొని వుంటేనే అసలైన జీవితానికి సిసలైన అర్ధం… లేకుంటే జీవితమే వ్యర్ధం” అంటూ ఈ జీవిత సత్యాన్ని తనదైన శైలిలో చెప్పింది తెలుగు చలనచిత్ర…

కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు

కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు

August 8, 2022

“మంచి కథలు రావడం వల్ల మంచి సమాజం ఏర్పడుతుందని, ఇటువంటి కథల పోటీలు నిర్వహించడం ద్వారా మంచి కథలు వెలువడతాయని” రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక గౌరవ సంపాదకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అన్నారు. ఆగస్ట్ 7, ఆదివారం ఉదయం విజయవాడ, ఠాగూర్ గ్రంథాలయంలో రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో జరిగిన కోపూరి శ్రీనివాస్ స్మారక విశిష్ట పురస్కారాలు జాతియ…