కథలపోటీ విజేతలకు బహుమతులు

కథలపోటీ విజేతలకు బహుమతులు

March 3, 2022

మల్లెతీగ మరియు చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ మార్చి 6న ఆదివారం ఉదయం విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరుగుతుంది. సుప్రసిద్ధ నవలా రచయిత శ్రీరామకవచం సాగర్ అధ్యక్షత వహించే ఈ సభకు ముఖ్య అతిధిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ హాజరవుతారు. అతిధులుగా…

‘జన రంజక కవి’ ప్రతిభా పురస్కారాలు

‘జన రంజక కవి’ ప్రతిభా పురస్కారాలు

“రావి రంగారావు సాహిత్య పీఠం” పురస్కారాల సభలో డా. జి.వి. పూర్ణచందు ఏక వ్యక్తికి పురస్కారం కాకుండా బహు వ్యక్తి పురస్కార విధానం చాలా మంది కవులకు మంచి ప్రోత్సాహం కల్పిస్తుందని కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డా. జి.వి. పూర్ణచందు తెలియజేసారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద శనివారం…

తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

February 23, 2022

ఋణానుబంధ రూపేణా అంటారు పెద్దలు. సూర్యుడు ఉదయించే గోదావరికి తూర్పున వుండే రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరంలో జూన్ నెల 28, 1931 న ఆదిలక్ష్మి కడుపున తొలి మగ సంతానంగా పుట్టాడు ‘బుడుగు’. బుడుగు పుట్టిన రెండేళ్లకు గోదావరికి పశ్చిమాన వున్న నరసాపురంలో ఉదయించాడు బుడుగు కి బొమ్మలేసే బాపు. బుడుగు-బాపులు చెట్టపట్టలేసుకుని డెబ్బై ఏళ్ళకు పైగా నడిచారు……

‘తానా’ నెల నెలా తెలుగు వెలుగు

‘తానా’ నెల నెలా తెలుగు వెలుగు

February 17, 2022

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమం ఫిబ్రవరి సోమవరం 21, 2022 న జరుగనుంది.ఈ అంతర్జాతీయ దృశ్య సమావేశానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొనననున్నారు.

కథా రచయిత ‘శ్రీ విరించి’ కన్నుమూత

కథా రచయిత ‘శ్రీ విరించి’ కన్నుమూత

February 7, 2022

శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి(87) జనవరి 26 (బుధవారం), 2022 చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఉదయం 11 గంటలకు రామానుజాచారి తుది శ్వాస విడిచారు. శ్రీవిరించికి ఒక కుమార్తె ఉన్నారు. రామానుజాచారి 1935లో విజయవాడలో జన్మించారు. రాజనీతి శాస్త్రంలో…

నూరేళ్ల ఐతిహాసిక ‘మాలపల్లి’ నవల

నూరేళ్ల ఐతిహాసిక ‘మాలపల్లి’ నవల

February 5, 2022

మాలపల్లి నవల వంద సంవత్సరాలుగా తెలుగు జాతి సామాజిక సాహిత్య సాంస్కృతిక పరిణామాలతో కలిసి ప్రవహిస్తున్న జీవనది. అప్పటికి నలభై ఏళ్లుగా ఎన్ని సార్లు కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు అది పాఠ్య గ్రంధం అయిందో తెలియదు కానీ 1976- 1977 కాకతీయ విశ్వవిద్యాలయం ఎమ్మే తొలి బ్యాచ్ విద్యార్థులకు, ప్రత్యేకించి ఒక సెమిస్టర్‌లో ఐచ్చికాంశంగా నవల పేపర్‌ను…

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు..

February 2, 2022

ప్రముఖ ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 31 జనవరి 2021న హైదరాబాద్ నల్లకుంటలోని తన నివాసంలో కన్నుమూశారు. తెలంగాణపల్లె జన జీవనం, పల్లె దర్వాజాలు, బతుకమ్మ పండుగలు, తెలంగాణా మగువలు దిన చర్యలు వంటి తదితర అంశాలను తన ఫోటోలలో చిత్రీకరించిన ఘనుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛాయాగ్రహకుడు భరత్ భూషణ్. పల్లె ప్రజల జీవన…

తెలుగు భాషోద్యమ సమాఖ్య

తెలుగు భాషోద్యమ సమాఖ్య

January 31, 2022

తెలుగు భాషోద్యమ సమాఖ్య విస్తృత సమావేశానికి ఆహ్వానం ఫిబ్రవరి 20వ తేదీన, ఆదివారం. తెలుగు భాషోద్యమ సమాఖ్యను 2003 ఫిబ్రవరి 21న స్థాపించినప్పటి నుండి తెలుగు భాష రక్షణ కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలోను, ఇతర ప్రాంతాలలోను నిర్వహించుకొన్నాము. మిత్ర సంఘాలను కూడా ప్రోత్సహించాం. పాలన, బోధన రంగాల్లో తెలుగు అమలు కోసం ఉద్యమాలను…

జ్ఞానపీఠ్ వచ్చినంత ఆనందం కలిగించింది

జ్ఞానపీఠ్ వచ్చినంత ఆనందం కలిగించింది

January 22, 2022

విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి ఏ.బి. ఆనంద్ గారి అనుభవాలు.. పారి నాయుడు నాకు మంచి మిత్రుడు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో పల్లెలలో పిల్లల్లో విద్యా వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య గారి భక్తుడు. వావిలాల వారి పేరుతో అనేక పాఠశాలలు నిర్మించి విద్యార్థులను ప్రోత్సహించే మనస్తత్వం కలిగినవాడు. ఆయన ఒకసారి నా సహకారం…

లఘు (పోస్ట్ కార్డు)కవితల పోటీ

లఘు (పోస్ట్ కార్డు)కవితల పోటీ

January 19, 2022

కవి, రచయిత గుండాన జోగారావు షష్టిపూర్తి సందర్భంగా ‘రమ్యభారతి’ పత్రిక ఆధ్వర్యంలో ‘లఘు కవితల’ పోటీలు నిర్వహిస్తున్నది. మినీ కవిత, హైకూ, నానీలు, రెక్కలు, నానోలు, వ్యంజకాలువంటి లఘురూపాలలో కవులు తమ రచనలు పంపవచ్చు. ఒక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చుగాని, ప్రత్యేకంగా పోస్ట్ కార్డు మీద రాసి పోస్ట్ లో మాత్రమే పంపాలి.బహుమతుల వివరాలు:మొదటి బహుమతి: రూ. 600/ద్వితీయ…