ఆరాధ్య గాయకునికి హార్ధిక నివాళులు

ఆరాధ్య గాయకునికి హార్ధిక నివాళులు

June 3, 2022

సంగీతం అనేది విశ్వజనీనం. ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం ఉంది. ఏకాలమైనా ఏదేశమైనా ప్రపంచ వ్యాప్తంగా మానవ హృదయాలను సంగీతం తన్మయింపజేస్తుంది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి’ అనేది ఆర్యోక్తి. సృష్టిలో సంగీతానికి ప్రకృతే పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహింపచేసే సంగీతానికి ఎల్లలులేవు. వాటిలో సినిమా సంగీతం జనరంజకమైనది. ఘంటసాల వంటి ఎందరో…

ఇసైజ్ఞాని ‘సినీ’ పద్మవిభూషణం

ఇసైజ్ఞాని ‘సినీ’ పద్మవిభూషణం

June 2, 2022

“చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన కొమ్మలెన్నో! అందులో ఇళయరాజా ఒక చిటారుకొమ్మ. నాభిహృత్కంఠ రసనల ద్వారా ఉద్భవించి ఉరికివచ్చే సప్తస్వర సుందరులను భజించిన నాదయోగులలో ఇళయరాజా ఒకరు’ అంటూ ఇళయరాజా ప్రాభవాన్ని, ప్రాశస్తిని కొనియాడింది ప్రముఖ సినీ గేయరచయిత వేటూరి సుందరరామమూర్తి. ఈ ఉపమానం చాలు ఇళయరాజా గొప్పతనాన్నిచెప్పడానికి. “సహజమైన సంప్రదాయ వాద్యపరికరాలతో సంగీతం సమకూర్చితే అందులో మనకు ఆత్మ…

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

జన హృదయాల్లో స్థానం చాలు!- పి. సుశీల

May 19, 2022

(హైదరాబాద్, రవీంద్రభారతిలో పి.సుశీల గారికి వెండి కిరీటం పౌర సన్మానం) భారతదేశం గర్వించదగిన మేటి గాయనీ మణులు ముగ్గురే ముగ్గురు అని, వారిలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారికి, దీదీ లతా మంగేష్కర్ గారికి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘భారత రత్న’ పురస్కారాలు లభించాయని, సుశీలమ్మకు వస్తే సంపూర్ణత చేకూరుతుంది, జనం హర్షిస్తారని నేను ప్రకటించగానే… కిక్కిరిసిన రవీంద్రభారతి ప్రేక్షకులు ఆమోదం తెలియచేస్తూ…

కవితా భాస్కరుడు మహాకవి శ్రీశ్రీ

కవితా భాస్కరుడు మహాకవి శ్రీశ్రీ

April 29, 2022

‘కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి’ అంటూ 1934లోనే మహాకవి శ్రీశ్రీ తను కలగన్న మరోప్రపంచానికి స్వాగతం పలికాడు…‘నేను సైతం విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకిలేస్తాను’ అంటూ ప్రతిజ్ఞచేశాడు.‘కూటికోసం కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవినిపెట్టక బయలుదేరిన బాటసారికి…

శంకర్-జైకిషన్ జోడీలో అగ్రజుడు

శంకర్-జైకిషన్ జోడీలో అగ్రజుడు

April 27, 2022

బాలీవుడ్ చిత్రసీమలోని సంగీత విభాగంలో అద్వితీయమైన సంస్కరణలతో అజరామరమైన పాటలకు ఊపిరులూది, హిందీ సినీ సంగీతాన్ని కీర్తిశిఖరాలకు చేర్చిన అద్భుత జంటగా శంకర్-జైకిషన్ ల పేరును ముందుగా చెప్పుకోవాలి. 1949 నుంచి 1971 వరకు ఈ జంట అందించిన సంగీతం కొత్తబాటలను పరచింది. ముఖ్యంగా 1950-60 దశకంలో ఈ జంట అందించిన సంగీతానికి ఎల్లలు లేవనడంలో సందేహం లేదు….

బుద్ధప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం

బుద్ధప్రసాద్ కు జీవన సాఫల్య పురస్కారం

April 25, 2022

సాంస్కృతిక శిఖరం వై.కె.నాగేశ్వరరావు గారిని అందరూ స్మరించుకుంటున్నారు. నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జంట నగరాల్లోని పలు సాంస్కృతిక సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమి వారు శుక్రవారం (22-4-22) హైదరాబాద్, త్యాగరాయ గానసభ లో వైవిధ్య కార్యక్రమం నిర్వహించి వై.కె.గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేకంగా వై.కె.స్మారక జీవన సాఫల్య…

మనోజ్ఞ రాగం… శంషాద్ బేగం

మనోజ్ఞ రాగం… శంషాద్ బేగం

April 23, 2022

విఖ్యాత గాయకుడు కే.ఎల్. సైగల్ ‘షాజహాన్’ చిత్రంలో పాడేందుకు స్టూడియోకు వెళుతున్నాడు. అదే స్టుడియోలో మరో పాట పాడేందుకు శంషాద్ బేగం కూడా అక్కడికి వచ్చింది. ఇద్దరూ ఎదురు పడ్డారు. సైగల్ షంషాద్ బేగంని చూశాడు. రికార్డింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు. ఆమె శంషాద్ బేగం అని సైగల్ కి తెలియదు. ఆ మాటకొస్తే చాలామంది కళాకారులకి ఆమె…

సంగీత అ’భయంకర’ శ్రీనివాస్….

సంగీత అ’భయంకర’ శ్రీనివాస్….

April 16, 2022

ఒకసారి ‘మంగళ’ అనే ఓ ప్రముఖ కన్నడ కుటుంబ వారపత్రిక ముఖచిత్రంగా ఒక కుచ్చు టోపీ బొమ్మ వేసి “ఈ టోపీ వాలా ఇంటర్వ్యూ వచ్చేవారమే” అంటూ శీర్షిక రాసింది. కన్నడిగులకు వెంటనే తెలిసిపోయింది ఆ వ్యక్తి ఎవరనే విషయం. చంక నిండా పది పన్నెండు పుస్తకాల దొంతరలు, జేబునిండా డజన్లకొద్దీ రకరకాల రంగుల పెన్నులు, భుజం మీద…

‘పి.వి. రమణ’ కు రావి కొండలరావు స్మారక పురస్కారం

‘పి.వి. రమణ’ కు రావి కొండలరావు స్మారక పురస్కారం

April 7, 2022

ఏప్రిల్ 2, 2022 శనివారం హైదరాబాద్ లో శ్రీ శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన 2022 సంవత్సరానికి శ్రీ రావి కొండలరావు స్మారక నగదు పురస్కారం ఘంటసాల గాయకులు శ్రీ పి.వి. రమణ, కాకినాడ గారికి ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా నరహరి మాస్టర్ గారు, చెన్నై (వెయ్యి సినిమాలకు పైగా మ్యూజిక్ కండక్టర్…

చలనచిత్ర సంగీత యుగపురుషుడు… మహదేవన్

చలనచిత్ర సంగీత యుగపురుషుడు… మహదేవన్

March 15, 2022

తమిళంలో ఆయన ‘తిరై ఇసై తిలగం’, తెలుగులో ఆయన ‘స్వరబ్రహ్మ’. జాతీయ స్థాయిలో సంగీత దర్శకునికి కూడా బహుమతి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినప్పుడు తొలి బహుమతి అందజేసింది అతనికే. సంగీత దర్శకునిగా యెంత గొప్పవారో, వ్యక్తిగా అంతకు మించిన మానవతావాది. ఎంతటి సౌమ్యుడంటే, ప్రముఖ వీణావిద్వాంసులు ఎస్. బాలచందర్ ‘శంకరాభరణం’ చిత్ర సంగీతాన్ని విమర్శిస్తే అతడు సమర్ధించుకోలేదు… పల్లెత్తు…